తెలంగాణ చానళ్లపై డీజీపీ కక్ష సాధింపు

సమైక్యాంధ్ర కోసం పనిచేస్తున్న తనపై వార్తలు ఉన్నదిఉన్నట్టు ప్రసారం చేస్తున్నరని.. నిన్న ఓల్డ్ సిటీ బాబా దగ్గరికి వెళ్లిన తనవార్తను ప్రసారం చేసిన్రని డీజీపీ తెలంగాణ చానళ్లపై కక్షగట్టింది. టీన్యూస్, వీ6పై పోలీసులు కేసు నమోదు చేసిన్రు. డీజీపీ బాబా దగ్గరికి వెళ్లిన వార్తను సీమాంధ్ర చానళ్లు ప్రసారం చేసినయి. సీమాంధ్ర పత్రికలు రాసినయి. వాటి మీద కేసు నమోదు చేయకుండా తెలంగాణ చానళ్లపై కేసులు నమోదు చేయడంలో సీఎం పక్షపాతం బట్టబయలైంది. సీమాంధ్రలో లేని ఉద్యమాన్ని ప్రసారం చేస్తూ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్న ఆంధ్ర చానళ్లపై కేసులు ఎందుకు నమోదుచేయడంలేదని తెలంగాణ జర్నలిస్టులు మండిపడుతున్నరు.

This entry was posted in CRIME NEWS.

Comments are closed.