తెలంగాణ గేయరచయిత రావేళ్ల కన్నుమూత

ఖమ్మం : తొలి తెలంగాణ గేయ రచయిత రావేళ్ల వెంకటరామరావు(95) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముదిగొండ మండలం గోకినేపల్లిలోని స్వగృహంలో మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ‘ధీరులకు మొగసాలరా! వీరులకు కాణాచి రా!’ అనే గేయాన్ని రచించింది రావేళ్ల. రావెళ్ల మృతికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు పలువురు రచయితలు, కవులు సంతాపం తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.