తెలంగాణ కోసం యువకుడి బలిదానం

poradu

పురుగుల మందు తాగి
మల్లేశ్ ఆత్మహత్య..
ఆదిలాబాద్ జిల్లా
కుర్మపల్లిలో విషాదం
సోనియమ్మ మనసు
మారాలంటూ సూసైడ్‌నోట్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యాన్ని తట్టుకోలేక మరో యువకుడు ప్రాణాలొదిలాడు. రాష్ట్ర్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, మాట తప్పిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి పరిధిలోని కుర్మపల్లికి చెందిన అందుగుల రాములు, పోషమ్మ దంపతుల ముగ్గురు సంతానంలో మల్లేశ్ (25) పెద్దకొడుకు. రాములు మందమర్రి ఏరియాలోని కేకే 5 గనిలో జనరల్ మజ్దూర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. పోషమ్మ వ్యవసాయం చేస్తూ కాయగూరలు పండిస్తోంది. బీకాం మధ్యలోనే ఆపేసిన మల్లేశ్.. ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్నేహితులతో నిత్యం చర్చిస్తుండేవాడు. తెలంగాణ కోసం నిర్వహించే ప్రతి ఆందోళనలో ముందుండేవాడు. తెలంగాణను సీమాంధ్ర నేతలు అడ్డుకుంటున్నారని కుటుంబసభ్యులతోనూ చెప్పేవాడు. తెలంగాణ వస్తే ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్తాయని అవగాహన కల్పించేవాడని స్థానికులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీ మాటతప్పడంపై తరుచూ ఆవేదన చెందేవాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చే అవకాశం లేదని వార్తలు వస్తుండడంపై కలత చెందాడు. ‘నా చావుతోనైనా సోనియమ్మ మనసు మారి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. రాష్ట్ర సాధన కోసం నాదే చివరి బలిదానం కావాలి’అని సూసైడ్‌నోట్ రాసి మంగళవారం చేనులో పురుగులమందు తాగి తుదిశ్వాస విడిచాడు. మృతదేహాన్ని చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, టీఆర్‌ఎస్ నేతలు సందర్శించి నివాళులర్పించారు. రామక్షికిష్ణాపూర్ ఎస్సై బన్సీలాల్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.