తెలంగాణ కోసం మరో బలిదానం

 

balidanam-రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యంపై మనస్తాపం
-పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మల్సూర్
-వరంగల్ జిల్లా తీగలవేణి శివారు తాల్లపాటి తండాలో విషాదం
-కాంగ్రెస్ మత్తు వీడి ప్రజలు ఉద్యమించాలంటూ సూసైడ్ నోట్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మరో యువకుడు ప్రాణాలొదిలాడు. కాంగ్రెస్ మత్తులో ఉన్న తెలంగాణ ప్రజలు మేల్కొని స్వరాష్ట్రం కోసం ఉద్యమించాలని సూసైడ్‌నోట్‌లో సూచించాడు. వరంగల్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి శివారు తాల్లపాటితండాకు చెందిన ధారావత్ బావ్‌సింగ్, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు, కూతురు. పెద్ద కుమారుడు మల్సూర్ ఎంకాం బీఈడీ పూర్తిచేశాడు. మహబూబాబాద్‌లో డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే తెలంగాణ కోసం జరిగే ఆందోళనల్లో పాల్గొనేవాడు.

ఖమ్మంలో పీజీ చేస్తున్న సమయంలో జేఏసీ నేతృత్వంలో ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ కోసం ఉద్యమించాలని, ప్రత్యేక రాష్ట్రం వస్తే భవిష్యత్ ఉంటుందని తరచూ తమతో చెప్పేవాడని స్నేహితులు తెలిపారు. రెండు నెలల కిందటే మల్సూర్ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా చేరాడు. వేసవి సెలవుల నేపథ్యంలో మూడు రోజుల కిందటే ఇంటికొచ్చాడు. రాష్ట్ర ఏర్పాటులో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తండావాసుల వద్ద వాపోయాడు. సంసద్ యాత్ర చేపట్టినా కేంద్రం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కేంద్రం తెలంగాణ ఇచ్చేలా లేదని మనస్తాపం చెందాడు. బుధవారం ఉదయం తండా సమీపంలోని పాకాలవాగు ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ‘హైదరాబాద్ చక్కని పాడి ఆవు. గడసరి గొల్లవాళ్ల మాదిరిగా తెలంగాణ ప్రజలను లేగదూడలను చేసి సీమాంవూధులు మూతికి గుడ్డకట్టారు. పాలు పితికి సొమ్ము చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అనే మత్తు పానీయాన్ని తీసుకుని గాఢ నిద్రపోవద్దు. ఇకనైనా తెలంగాణ ప్రజలు మేల్కొవాలి. ప్రజలు, సంఘాలు, రాజకీయ నాయకులు ఏకమై తెలంగాణ సాధించాలి’ అని రాసిన సూసూడ్‌నోట్ మృతుని జేబులో లభించింది. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎండీ హన్నన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.