తెలంగాణ కోసం బీజేపీలో చేరుతున్నా

– ఎండలు తగ్గాక చేరిక సభ తేదీని ప్రకటిస్తా
– బీజేపీ – ఎన్‌డీఏతోనే తెలంగాణ సాధ్యం
– కాంగ్రెస్ – యూపీఏతో రానేరాదు
– మూడోఫ్రంట్ సొంతంగా గెలువలేదు
– అందుకే బీజేపీలో చేరుతున్నా: నాగం

తెలంగాణ కోసమే తాను బీజేపీలో చేరుతున్నట్లు తెలంగాణ నగారా సమితి వ్యవస్థాపకుడు, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌డ్డి స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ పీఆర్ అతిథిగృహంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏతోనే తెలంగాణ సాధ్యమని, అందుకే తాను బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఇచ్చే అవకాశాలు లేవన్నారు. ఇక చంద్రబాబు, ములాయంసింగ్‌యాదవ్‌లు పచ్చి తెలంగాణ వ్యతిరేకులు కనుక మూడో ఫ్రంట్‌తో కూడా తెలంగాణ రాదని స్పష్టం చేశారు. మూడోవూఫంట్ అధికారంలోకి రావాలన్నా కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు ఉంటేనే సాధ్యమవుతుందన్నారు

. బయ్యారం గనులతోపాటు ఉద్యమం, ఎన్నికల్లోనూ అందరూ ఏకమైతేనే ఫలితం ఉంటుందని నాగం అన్నారు. తెలంగాణతోపాటు జిల్లా, నియోజకవర్గవూపజలూ తనను ఆదరిస్తూ వస్తున్నారని తెలిపారు. అందుకోసం ప్రజలందరితో తాను బీజేపీలో ఎందుకు చేరుతున్న విషయాన్ని తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం త్వరలో మండల స్థాయిలో కార్యకర్తలతో సమావేశమవుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, 45డిగ్రీల ఉష్ణోక్షిగతల మధ్య బీజేపీలో చేరిక సభ నిర్వహించడం కష్టమన్నారు. అందుకే ఎండలు తగ్గాక బీజేపీలో చేరిక సభ తేదీని ప్రకటిస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, మంత్రులు అవినీతిలో కూరుకుపోయారని, వీటన్నింటి వెనుక సోనియా ఉన్నారని నాగం జనార్దన్‌డ్డి ఆరోపించారు.

కేంద్రంలో అవినీతి పరాకాష్ఠకు చేరిందన్నారు. ఇప్పటికే కుంభకోణాల్లో యూపీఏ ప్రభుత్వంలోని మంత్రులు జైళ్ల పాలుకాగా, రైల్వే మంత్రి బన్సల్ ముడుపుల వ్యవహారంలో చిక్కారని అన్నారు. బొగ్గు కుంభకోణంలో కోర్టు రిపోర్టులను న్యాయశాఖ మంత్రి అశ్వినికుమార్ చూడటంలో ప్రధానమంత్రి పాత్రపై అనుమానం కలుగుతోందన్నారు. కర్ణాటకలో అవినీతికి కారణం ఆంధ్రా సీఎం అంటూ పరోక్షంగా దివంగత సీఎం వైఎస్‌పై ఆరోపణలు గుప్పించారు. కర్ణాటకలో బీజేపీ అవినీతి సీఎం, మంత్రులను తొలగిస్తే కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అలాంటి చర్యలేవీ తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇదంతా చూస్తుంటే ఈ అవినీతి వెనుక సోనియాగాంధీ ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. చైనా దురాక్షికమణకు పాల్పడుతున్నా, పాకిస్థాన్ భారతీయుల తలలు నరుకుతున్నా అడ్డుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో ఎలాంటి ముందడుగు వేసినా జాతి యావత్తు వెనుక ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీఎన్‌ఎస్ నాయకులు అర్థం రవి, మోతికుమార్, బాలాగౌడ్, పస్పుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.