తెలంగాణ కోసం.. బహ్రెయిన్‌లో బలిదానం

barmanen– కరీంనగర్ జిల్లా
యువకుడు శ్రావణ్ఆత్మహత్య
– రాష్ట్రం కోసంమరో బలిదానం
– విషాదంలో భీముని మల్లారెడ్డిపేట
తెలంగాణ ఆకాంక్ష దేశ హద్దులు దాటి పరాయి దేశాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకొంటున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, కెనడా తదితర ప్రాంతాల్లో ప్రవాస తెలంగాణవాదులు ఉద్యమం కోసం తమ వంతుగా పోరాడుతున్నదీ కనిపిస్తున్నదే. ఒకవైపు ఇలాంటి తెగువ కొనసాగుతున్నా మరోవైపు తెలంగాణ ఆకాంక్ష ఇంకా నెరవేరడం లేదనే ఆవేదన అమాయక యువతను అల్లకల్లోలానికి గురిచేస్తున్నది. అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తున్నది. ఆ కోవలోనే.. తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మబలిదానానికి పాల్పడ్డాడు.

ఉన్న ఊరిలో ఉపాధి కరువై పొట్టచేత పట్టుకొని ఎడారి దేశమైన బహ్రెయిన్‌కు వలస వెళ్లిన కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం భీమునిమల్లాడ్డిపేటకు చెందిన పొన్నాల శ్రావణ్‌కుమార్ (24) శనివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రావణ్‌కుమార్ తండ్రి రాజం రెండేళ్లక్షికితం మరణించడంతో కుటుంబ బాధ్యతలు తనే మోస్తున్నాడని, ఉపాధి కోసం 20 నెలల క్రితం బహ్రెయిన్ వెళ్లాడని గ్రామస్తులు తెలిపారు. తెలంగాణ వస్తే స్వగ్రామంలో ఉపాధి దొరుకుతుందని భావించిన శ్రావణ్ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతగానే పరితపించేవాడు. కుటుంబసభ్యులతో, మిత్రులతో ఫోన్‌లో మాట్లాడిన ప్రతిసారీ తెలంగాణ ఎప్పుడు వస్తుందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై చర్చించేవాడు. కేంద్రం నాన్చివేత ధోరణితో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ మధ్య కాలంలో కేంద్ర మంత్రులు షిండే, ఆజాద్ ప్రకటనలతో కలత చెంది శనివారం సాయం త్రం బహ్రెయిన్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడికి తల్లి అంజవ్వ, సోదరుడు నరేశ్ ఉన్నారు. మరణవార్త వినగానే కుటుంబంలో, భీమునిమల్లాడ్డిపేటలో విషాదం అలుముకుంది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.