హైదరాబాద్: టీఆర్ఎస్లో ఉండి తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం పోరాడతానని స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ భవన్లో ఇవాళ ఆయన టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం ప్రసంగించారు. పార్టీలోకి ఆహ్వానించిన వారికి తాను రుణపడి ఉంటానని స్వామిగౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఇచ్చిన తెలంగాణ చేతిలో పట్టుకుని ముందుకు నడిచిన తెలంగాణ బిడ్డగా స్వామిగౌడ్ తనకు తాను అభివర్ణించుకున్నారు. పార్టీ ఏం చేయమంటే అది చేయడానికే తాను పార్టీలోకి వచ్చానని తెలిపారు. ఈ సమయంలో తనకు ఊహించనటువంటి ఆనందం కలుగుతుందని తెలిపారు. సకల జనుల సమ్మె కాలంలో దేవీప్రసాద్ అపర చాణక్యుడిగా వ్యవహరించారని స్వామిగౌడ్ కితాబునిచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఉద్యోగులందరికీ పాదాభివందనాలు చేస్తున్నానని తెలిపారు. ‘సమ్మె చేసింది ఉద్యోగులైతే పెద్దలంతా కలిసి నన్ను టైగర్‌ను చేశారు’ అని ఆయన అన్నారు. ‘ఉద్యోగులకు కెప్టెన్‌గా వ్యవహరించినందుకు నాకెంతో గర్వకారణంగా ఉంది’ అని తెలిపారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేసే శక్తి ఉద్యోగులకు ఉందని, సీఎం జీతాన్ని ఆపే శక్తి కూడా ఉద్యోగులకు ఉందని, కానీ, ఏనాడు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదని స్వామిగౌడ్ పేర్కొన్నా
తెలంగాణ కోసం పోరాడుతా: స్వామిగౌడ్
Posted on November 16, 2012
This entry was posted in TELANGANA NEWS, Top Stories.