తెలంగాణ కోసం నేలరాలిన మరో యువ కిరణం

ssss సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాళ్లకు ఉద్యోగాలురావనే ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన చల్లమల్ల శివరాం(23) ఉరేసుకుని తనువు చాలించాడు. చల్లమల్ల కృష్ణయ్య, పార్వతమ్మ దంపతుల కొడుకు శివరాం నల్లగొండలో ఐటీఐ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం నార్కట్‌పల్లి శివారులోని పరిక్షిశమల చుట్టూ తిరిగాడు. తెలంగాణకు చెందినవాడవడంతో కనీసం దరఖాస్తు ఫారాన్ని సైతం తీసుకోకుండా వివక్ష ప్రదర్శించడంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నాపేరు శివరాం. ఐటీఐ చదివాను. ఇక్కడి లోకల్ కంపెనీలలో జాబ్ కోసం ప్రయత్నించా. కానీ నేను తెలంగాణవాడిననే కారణంతో ఉద్యోగం ఇవ్వలేదు. తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందనుకుంటున్నా. ఇప్పటివరకు తెలంగాణ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నా.

నా మరణంతోనైనా తెలంగాణ వస్తే మనోళ్లకి ఉద్యోగాలు వస్తాయి. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. జై తెలంగాణ, జైజై తెలంగాణ. తెలంగాణ బిడ్డ శివరాం’అని రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్యతో తల్లిదంవూడులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నార్కట్‌పల్లి శివారులోని రాశి కంపెనీలో తల్లిదంవూడులు దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. నిత్యం ఇంట్లో తెలంగాణపైనే మాట్లాడుతూ ఉద్యమంలో చురుకుగా పాల్గొనే వాడని తల్లి గుండెలవిసేలా విలపించింది.

This entry was posted in CRIME NEWS, TELANGANA NEWS, Top Stories.

Comments are closed.