తెలంగాణ కోసం దేనికైనా రెడీ-కేసీఆర్‌

-టీఆర్‌ఎస్‌లో చేరికలు రాజకీయం కాదు

-తెలంగాణకోసం అందరూ ఒక్కటి కావాలి.. కాంగ్రెస్‌ను బొందపెట్టాలి 

– మోసపోయింది చాలు.. గోసపడ్డది చాలు
– ఉద్యమంలో నిబద్ధత ఉన్న కేకేను ఎంపీని చేద్దాం
– వద్దన్నవారి ముఖంమీద చెళ్లున కొట్టినట్లు చేద్దాం
– ఆంధ్రపార్టీలు మనకవసరమా.. అవసరం లేదు
– ఆ పార్టీల్లో తెలంగాణోళ్లకు ఏ పదవులిస్తరు?
– తెలంగాణ ఇప్పటికీ మిగులు బడ్జెట్‌లోనే ఉంది
– ప్రత్యేక రాష్ట్రంలో పదవులు తీసుకోను.. కాపలాకుక్కలా ఉంటా
– టీఆర్‌ఎస్ అభినందన సభలో కేసీఆర్

– టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్, టీడీపీ నేతలు..
పీసీసీ మాజీ చీఫ్ కేకే, ఎంపీలు వివేక్, మందా, మాజీ మంత్రులు వినోద్, చంద్రశేఖర్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, టీడీపీ నాగర్‌కర్నూల్ ఇన్‌చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి, డాట్స్ చైర్మన్ నర్సయ్య, వెంకట్‌గౌడ్, సుధాకర్‌రెడ్డి..

‘ఎంపీలు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడం రాజకీయ చేరిక కాదు. ఇది చిల్లరమల్లర రాజకీయం కానేకాదు. ఇది ధర్మయుద్ధం. ప్రజాక్షేవూతంలో ప్రజలు సాగిస్తున్న ధర్మయు ద్ధం. మోసపోయింది చాలు.. గోసపడ్డది చాలు. అందరూ ఒక్కటి కావాలి. ఏకమై కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలి. పాతాళంలోకి ఐదు కిలోమీటర్ల లోపల పాతిపెట్టాలి. ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. జూన్ 14న చలో అసెంబ్లీ ఉంది. గ్రామక్షిగామాన కదిలిరావాలి. మేధావులు పిడుగులై కదలాలి. ఇండియాలోనే ఇప్పటివరకు జరగనటువంటి చలో అసెంబ్లీని చేద్దాం’ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు రాజీనామా చేసిన ఎంపీలు వివేక్, మందా, పీసీసీ మాజీ అధ్యక్షుడు కే కేశవరావు, మాజీ ఎంపీ మాణిక్‌డ్డి, టీడీపీ నాగర్‌కర్నూల్ ఇన్‌చార్జి మర్రి జనార్దన్‌డ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, డాట్స్ చైర్మన్ నర్సయ్య గౌడ్, వెంకట్‌గౌడ్, ఎడ్ల సుధాకర్‌డ్డి ఆదివారం నిజాం కాలేజీ గ్రౌండ్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన వారందరికీ పార్టీ కండువాలు కప్పి అభినందించారు. అనంతరం సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఎంపీలు వివేక్, జగన్నాథ్ కొట్లాడారు..
ఎంపీలు వివేకానంద్, జగన్నాథ్ ప్రధాని, సోనియాగాంధీ ముందే కొట్లాడారు. నేను, విజయశాంతి కలిసి పార్లమెంట్‌లోని స్పీకర్ పోడియం ముందు ధర్నాచేస్తుంటే మాతోపాటు కలిసి వచ్చారు. ఒక సందర్భంలో స్పీకర్ మాతో ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్‌కు ప్రణబ్‌ముఖర్జీ కూడా వచ్చారు. స్పీకర్ కార్యాలయం టాప్ లేచిపోయేటట్లు ప్రణబ్‌తో గొడవపడ్డారు. దయచేసి తెలంగాణ అంశాన్ని తేల్చాలని ఘంటాపథంగా చెప్పారు. వారు చేయని ప్రయత్నం లేదు. విసిగెత్తిపోయారు. అవమానాలు పడ్డారు. అయినా నిర్ణయంరాదని తెలిసి ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. పేపర్లు అడ్డగోలుగా రాస్తున్నాయి. ఎన్నికల్లో నేను పోటీ చెయ్య.. నా కుటుంబం నుంచి ఎవరూ పోటీచేయరని కేశవరావు చెప్పినా.. రాస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో నిబద్ధతతో, నిటారుగా ఉన్న వ్యక్తి కేకే. మీకు వ్యక్తిగతంగా పార్లమెంట్ సభ్యత్వం అవసరం లేకున్నా.. మీ అవసరం మాకుంది. మీకు రాజ్యసభ ఇవ్వకుండా అవమానించారు. వారి ముఖం మీద కొట్టేట్లుగా మీరు తప్పకుండా పార్లమెంట్‌లో ఉండాలి.

ఆంధ్రపార్టీలు మనకు అవసరమా.. అని చర్చ పెట్టండి
ఇది చిల్లరమల్లర రాజకీయ చేరిక, వేదిక కాదు. పార్టీలు, పదవులు వద్దనుకుని ఒక్కటవుతున్న సందర్భం నిజాం కాలేజీ గ్రౌండ్‌లో కనిపిస్తోంది. 2001లో ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మా మాజీ ఎంపీ వినోద్ ఒక మాట అన్నాడు. అన్నా.. ఇది ఎందాక అని. చెప్పిన. మొండిగా పోరాడాలి. అవమానిస్తారు. అనేక ప్రయత్నాలు చేస్తారు. ఒకనాడు తెలంగాణ బరిగీసి తెలంగాణ ఇవ్వాలనే రోజు వస్తుంది. ఇప్పుడు అదే నిజమైంది. భవిష్యత్తులో ఇంకెంతోమంది వస్తారు. ఫ్యామిలీ ప్యాకేజీలు తీసుకున్నారని కొన్ని ఆంధ్ర పత్రికలు రాస్తున్నాయి. ఇప్పటికే కేశవరావు, మందా జగన్నాథం చెప్పారు. ఆ పత్రికలు రాసేవి కారుకూతలు. కారుకూతలు కూసేవారి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. కాళ్లకింద భూమి కదులుతోంది. ఆంధ్ర మీడియాలోని ఒక వర్గానికి చెప్తున్నా.. ఒక హద్దు ఉంటుంది. వక్రీకరించి రాసే ఆంధ్ర మీడియాకు మరోసారి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. పవివూతమైన తెలంగాణ ఉద్యమం ఒక్కోసారి తక్కువగా, ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడూ ఆపలేదు. ఎవరూ ఆపలేరు. కానీ దాన్ని అర్థం చేసుకోకుండామేం రాస్తాం అంటే అది మీ మూర్ఖత్వమే.

13 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో కేంద్రం ఒక ప్రకటన చేసింది. తెల్లారేసరికి ఏ విధంగా దగా, మోసం చేశారో చూసినం. అందరూ తీవ్రంగా ఆలోచించాలి. ఈ గడ్డమీద ఆంధ్రపార్టీలు అవసరమా..? అని. వద్దనేవారు చేతుపూత్తండి. దీనిపై మీమీ గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఆ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో రెండు ఆంధ్ర పార్టీలు టీడీపీ, వైఎస్‌ఆర్ పార్టీలు. ఈ రెండు పార్టీలకు ఒక్క తెలంగాణోడైనా పార్టీ అధ్యక్షుడు అయితడా. కానే కాడు. ఈ పార్టీలు గెలిస్తే సీఎం పదవులను మనోడికి ఇస్తారా. ఇప్పుడన్నీ పదవుల్లోనూ ఆంధ్రావాళ్ళే ఉన్నారు. 57 సంవత్సరాల సమైక్య రాష్ట్రంలో కేవలం మూడున్నరేళ్లు మాత్రమే తెలంగాణోళ్లు సీఎం పదవుల్లో ఉంటే మిగిలిన 53 సంవత్సరాలు ఆంధ్ర సీఎంలే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఇంత ఉన్నా అన్ని పదవులు సీఎం, పీసీసీ, స్పీకర్, చైర్మన్ పదవుల్లో అందరూ వారే. మనం ద్వితీయక్షిశేణి పౌరులమా. మీరు శాశ్వత గులాంలుగా మా దగ్గర పడి ఉండాలని అంటున్నారు. ఎన్ని ఉద్యమాలు చేసినం.. 40 రోజుల సకల జనుల సమ్మె చేసినం. బతుకమ్మ, దసరా పండుగలను కూడా ప్రజలు త్యాగం చేశారు. ఇంకే చేయాలి.

చప్రాసీకున్న జ్ఞానం ప్రధానికి లేదని అంటనే ఉంటా..
నిన్ననే ఓ పుణ్యాత్ముడు నాపై కేసు పెట్టిండట. పార్లమెంట్‌లో అందరు ఎంపీలు, మంత్రులు పోతుంటే చప్రాసీలు నమస్తే అంటారు. కానీ నేను, విజయశాంతి పోతుంటే మాత్రం జై తెలంగాణ అంటారు. తెలంగాణ డిమాండ్‌లో నిజాయితీ ఉంది కొట్లాడండి సార్ అంటారు. ఇక ప్రధాని దగ్గరికిపోయి అయ్యా మా తెలంగాణ పరిస్థితి ఏందీ అంటే మాత్రం చడీచప్పుడు చేయడు. ఎవరికీ అర్థంకాడు. రాయిపూక్క కూర్చుంటడు. చప్రాసీకి అర్థమైంది. ఆయనకున్న జ్ఞానం నీకు లేదా ప్రధాని అని అన్నా. మా సమస్య పరిష్కరించేవరకు అంటనే ఉంటా. ఎన్ని జైళ్లలో పెడుతరో పెట్టండి. ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న సమయంలో ఇప్పుడు బయ్యారం ఇనుప గనులను విశాఖకు తీసుకుపోతాం అంటున్నారు. ఒకనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో నేను కూడా లాఠీదెబ్బలు తిన్నా. ఇప్పుడు అందులో 30వేల మంది ఉద్యోగులుంటే మన తెలంగాణ వాళ్లు 300మంది కంటే ఎక్కువ లేరు. అదే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని పెడితే ఇక్కడి బిడ్డలకు 30వేల మందికి ఉద్యోగాలొస్తాయి. ఇన్నాళ్లు మా నీళ్లు, ఉద్యోగాలు, సంపదను దోచుకుపోయారు. ఇప్పుడు మా మట్టిని కూడా తీసుకుపోతరా అని ఈటెల రాజేందర్, హరీష్‌రావు మాట్లాడుతుంటే సీఎం ఒక్క పైసా కూడా ఇయ్య అన్నడు. ఆయనకు గర్వం, తలపొగరు ఉండొచ్చు. మా ఎమ్మెల్యే ఈశ్వర్ అంటున్నారు. నిండు అసెంబ్లీలో ఒక్కపైసా ఇయ్య అన్న సీఎంపై కేసు పెట్టాలని.

కిరణ్‌కుమార్‌డ్డి అంటే భయపడి చిన్నబోం. ఆయన తాత జేజెమ్మలొచ్చినా కూడా భయపడం. నిండు అసెంబ్లీలో సీఎం అంటుంటే తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. చీమునెత్తురు లేదా. పైసా కూడా ఇయ్యా అంటుంటే దద్దమ్మలపూక్క, దద్దన్నల లెక్క కూర్చున్నరు. మమ్మల్ని దద్దమ్మలంటారా అంటారు. మనం ఈ దద్దమ్మలను గెలిపిద్దామా..? జూన్ 14న చేపట్టే చలో అసెంబ్లీకి జంటనగరాల ప్రజలు తరలిరావాలి. టీఆర్‌ఎస్ ఇటీవల ఇంటింటికీ టీఆర్‌ఎస్ కార్యక్షికమం పెడితే పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అది నాకు తెలుసు. పెద్ద ఎత్తున సిటీ ప్రజలు కలిసి రావాలి. తెలంగాణ ఇప్పటికీ మిగులు బడ్జెట్‌లోనే ఉంది. బీపీఆర్ విఠల్ మాజీ ఆర్థిక కార్యదర్శి. ఆయన గతంలో రాసిన పుస్తకంలో తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌లో ఉందని చెప్పారు. ఈ మధ్య కూడా ఒక పుస్తకం రాశారు. సమైక్య రాష్ట్రంలోనూ తెలంగాణ మిగులు బడ్జెట్‌లోనే ఉందని చెప్పారు. 2013-14 సంవత్సరంలో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.62వేల కోట్ల ఆదాయం చూపించింది. అందులో 47వేల కోట్ల ఆదాయం తెలంగాణ నుంచే. సీమాంధ్ర నుంచి కేవలం 15వేల కోట్ల రూపాయలు మాత్రమే. వనరులున్న రాష్ట్రం తెలంగాణ.

ప్రజాయుద్ధంగా మారాలి: కేకే
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం ఇక ప్రజాయుద్ధంగా మారాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు కే కేశవరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఆదివారం సాయంత్రం నిజాంకాలేజీ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కేకేకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజల హర్షధ్వానాల నడుమ కేకే మాట్లాడుతూ ఉద్యమకారుల చేరికకు వర్షం హర్షం పలుకుతోందని, ఉద్యమ కథా నాయకుడు దశా దిశా నిర్ధేశనం చేసినా.. ఉద్యమ రథసారథులు మాత్రం ప్రజలేనని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమం ధర్మయుద్ధమని అభివర్ణించారు. తెలంగాణ కోరుతూ వెయ్యి మంది ప్రాణత్యాగాలు చేసుకున్నా అసెంబ్లీ, పార్లమెంట్‌లకు కనీసం కానరాకపోవడం ఏమిటన్నారు. అమరుల ఆశయాలు మన మనసుల్లో ఉన్నందునే వాటిని సాధించేందుకు బయటకు వచ్చామని ఆయన తెలిపారు. తెలంగాణ కోసం 13ఏళ్లు వేచిచూశామని, ఇంకా మనసులో తెలంగాణ భావం పెట్టుకుని బయటకు ఏదో చెప్పడం కన్నా చిత్తశుద్ధితో ఉద్యమించేందుకు సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ మన హక్కు అని భావించే.. ఇక ఒత్తిళ్లు, సభలు, పాటలు కాకుండా పోరాటం చేయాల్సిందేనన్న భావనతోనే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లోని కీలక నిర్ణయాలు తీసుకునే అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన ఏఐసీసీపై నమ్మకం లేకనే ఆ పార్టీనుంచి బయటకు వచ్చానని కేశవరావు స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమంలో భాగంగా జేఏసీ, ప్రజలు, ఉద్యోగులు, సమాజం, విద్యార్థులు ఉద్యమించి రహదారులను దిగ్భందించడంతోపాటు పార్లమెంట్‌ను స్తంభింపజేసి 42 రోజులపాటు భారీ ఉద్యమాన్ని నడిపారని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్యయుతంగా తమ ఆకాంక్షను వెల్లడిచేసే అన్నిరకాల మార్గాలను ప్రజలు అనుసరించినా వాటిని పాలకులు పట్టించుకోలేదని, రాజ్యాంగం ప్రకారం అందరికంటే ప్రజలే శక్తివంతమైనవారని, వారు తమ ఓటు అనే శక్తితో తెలంగాణ సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం పెంచి, పోరాట పటిమను పెంచేందుకు కార్యోన్ముఖులం అవుదామని టీఆర్‌ఎస్ శ్రేణులకు కేకే సూచించారు. తెలంగాణ సాధన ఊపిరిగా.. ధ్యేయంగా ఎంతదూరమైనా సాగేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.

పదవులొద్దు.. కాపలా కుక్కలా ఉంటా..
కేసీఆర్‌కు పదవులు అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రానికి కాపలాకుక్కలా ఉంటా. తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంవూతిగా ఉంటడు. లక్షలోపు రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం. పేద పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తాం. ఈ ప్రభుత్వం బలహీనవర్గాలకు ఇళ్లు అంటూ పంది గుడిసెలు కట్టిస్తోంది. ఆ ఒక్క రూంలోనే పిల్లలు, తల్లిదంవూడులు, వారి సామాను ఉండాల్నా. ఆ పంది గుడిసెల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు నెలలు ఉండండి. మీకేమో పదిహేను వేల అడుగుల ఇళ్లు కావల్నా. 70 బెడ్‌రూంలుండే ఇళ్లు కావాల్నా.

మేం మాత్రం అనాగరికంగా బతకాల్నా. తెలంగాణ రాష్ట్రంలో 120 గజాల స్థలంలో 50 గజాల్లో 400 అడుగుల డబుల్‌బెడ్‌రూం ఇల్లు, ఇంటి 20 గజాల స్థలం, ఇంటిముందు 50 గజాల స్థలం ఉండేలా చూస్తా. తెలంగాణ రాష్ట్రం కడుక్క తాగెతందుకు కాదు. మాటమీద ఉండేటోన్ని. మాటకోసం తలనరుక్కుంట కాని తలదించ. ఈ దుక్కానికి ముగింపు రావాలి. ఈ దుక్కం అంతం కావాలి. కోటి ఎకరాలకు నీరిచ్చి పొలాలను పచ్చగా చేసుకుందాం. టీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ. ఈ పార్టీకి కులం, మతం లేదు. వీటిపేర్ల మీద చీలిపోయే సంస్థ టీఆర్‌ఎస్ కాదు. ముస్లింలు, హిందువులు కలిసి ఉన్న ప్రాంతం తెలంగాణ. 2001లో నేను ఒక్కడినే. ఇప్పుడు తెలంగాణ ఉప్పెనై, సమువూదంగా మారింది. ఢిల్లీని కమాండ్ చేసి తెలంగాణ తెచ్చుకుందాం. పాత తెలంగాణను మళ్లీ తెచ్చుకుందాం. రేపటి నుంచి నాతోపాటు ఎంపీలు కూడా పది జిల్లాలు తిరిగి అంతా వారే మాట్లాడుతారు. వర్షంవల్ల వారు మాట్లాడలేకపోయారు.

సభ సైడ్‌లైట్స్
-తెలంగాణ ప్రార్థనాగీతం ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’తో బహిరంగ సభ ప్రారంభమైంది.
-సభ ప్రారంభానికి ముందు రసమయి బాలకిషన్ నేతృత్వంలోని సాంస్కృతిక కార్యక్షికమాలు ఆలరించాయి.
-రసమయి పాటలు పాడుతున్న సందర్భంలో సభకు వచ్చిన ప్రజలు ఈలలు, డ్యాన్స్‌లతో ఉర్రూతలూగారు. చిన్నగా వర్షం ప్రారంభమైనా.. ప్రజలు కుర్చీలను నెత్తిన పెట్టుకుని పాటలు విన్నారు.
-విద్యార్థి సంఘం నేత సాయిచరణ్ పాడిన ఉద్యమ గీతం ‘వీరుల్లారా వీర వనితల్లారా..’ అలరించింది. గాయకుడు అష్ట గంగాధర్ పాడిన ‘తెలంగాణమా.. తెలంగాణమా… తెలంగాణమమ్మో’ పాటతోపాటు సీఎం కిరణ్‌కుమార్‌డ్డిపై పాడిన పాట సభికులను ఉర్రూతలూగించింది.
-చంద్రబాబు, సోనియా, సీఎంలను పాటల రూపంలో విమర్శించిన తీరుకు సభలో చప్పట్లతో మద్దతు లభించింది.
-సభలో ఎంపీ వివేక్ ఫొటోఉన్న ప్ల కార్డులను అభిమానులు ప్రదర్శించారు. సభ అనంతరం ఆయన్ను ఎత్తుకుని అనుచరులు అభినందనలు తెలిపారు.
-ముందుగా అనుకున్న ప్రకారం 8మంది వక్తలను మాట్లాడించాలనుకున్నారు. కానీ వర్షం పడటంతో కేకే తర్వాత కేసీఆర్ ప్రసంగించి సభను ముగించారు.
-కేసీఆర్ ప్రసంగంలో ఆంధ్ర పార్టీలను 5 కిలోమీటర్ల లోతులో బొందపెట్టాలనడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
-‘తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం వెనక్కిపోయినట్లే.. వర్షం కూడా వెనక్కిపోయింది’ అని కేసీఆర్ అన్నప్పుడు ప్రజలు ఈలలతో మోతెక్కించారు.
-తెలంగాణలో ఆంధ్రపార్టీలు అవసరమా..? కేసీఆర్ ప్రశ్నించగా, లేదు.. లేదు అని సభికులు స్పందించారు.
-సభ ప్రారంభానికి ముందు నుంచే వర్షం కురిసినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు అధినాయకుల కోసం ఎదురు చూశారు.
-తెలంగాణ ఉద్యమంలో చేరిన నేతలు కే కేశవరావు, వివేక్, మందా జగన్నాథం కటౌట్లను సభా ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేశారు.
-పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మూడు మార్గాల్లో ట్రాఫిక్ నియంవూతణ చేశారు.

పార్టీలో చేరింది వీరే 
పీసీసీ మాజీ అధ్యక్షుడు కే కేశవరావు, ఎంపీలు మందా జగన్నాథం, వివేక్‌లతోపాటు మాజీ ఎంపీ మాణిక్‌డ్డి, మాజీ మంత్రులు వినోద్, చంద్రశేఖర్, టీడీపీ నాగర్‌కర్నూల్ ఇంచార్జి మర్రి జనార్దన్‌డ్డి, మాజీ ఎమ్మెల్యే శివవూపసాద్, డాట్స్ జేఏసీ చైర్మన్ బూర నర్సయ్యగౌడ్, టీడీపీ నాయకులు జే వెంకట్‌గౌడ్, అంబర్‌పేట్ నుంచి సుధాకర్‌డ్డి, సీపీఐ నేత అజీజ్‌ఖాన్, బీ శ్రీనివాస్‌డ్డి, నగర నాయకులు యూసుఫ్, సీపీఎం నాయకులు లాయక్ అలీ, బీజేపీ ఎగ్జిగ్యూటివ్ మెంబర్ జక్క రఘునందన్‌డ్డి, నాయకులు చల్ల సత్యనారాయణడ్డి, బీ లింగంగౌడ్, ఆలిండియా బ్రాహ్మణ సంఘం నాయకులు రాములు దేశ్‌పాండే, ఇతర నేతలు జీ వెంకటస్వామి, రాములు, మాధవడ్డి, నర్సింహ్మతోపాటు వందలాది మంది నాయకులు, కార్యకర్తలున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.