తెలంగాణ కవిత్వమే తెలుగు కవిత్వం: సిధారెడ్డి

తెలుగు భాషా సాహిత్యంలోని కవిత్వం అంతా తెలంగా ణ కవిత్వమేనని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. ప్రముఖ కవి లోచన్ రాసిన ‘ఆదాబ్ హైదరాబాద్’ తెలంగాణ ఉద్యమ కవిత్వం పుస్తకావిష్కరణ తెలంగాణకళల వేది క ఆధ్వర్యంలో ఆదివారం హన్మకొండలోని టీఎన్జీవో భవన్‌లో నిర్వహించారు. నగరానికి చెందిన కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హాన్స్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ టంకశాల అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి ప్రధానోపన్యాసం చేశారు. ఉద్యమ నేపథ్యంలో రాసినకవిత్వానికి ఆదరణ ఎప్పటికీ ఉంటుందన్నారు. హైదరాబాద్ ఒక సాంస్కృతిక చిహ్నమని, దీన్ని యూనియన్ టెరిటరీగా మార్చాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని మలుపులున్నాయో వాటన్నింటినీ లోచన్ కవిత్వం రూపంలో మనముందుంచారన్నారు. టంకశాల అశోక్ మాట్లాడుతూ పూర్తిగా తెలంగాణ ఏర్పాటు పూర్తికాలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం లో కొత్తవిలువలు, ఆలోచనలతో పరిపాలన చేసి ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.