తెలంగాణ కల నిజం

 

dec9-మహత్తర సందర్భానికి ఉద్యమ స్మరణ
-నేడు తెలంగాణవ్యాప్తంగా స్ఫూర్తిదినం
-టీజేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపు
-సాయంత్రం కొవ్వొత్తులతో ప్రదర్శనలు
-విజయవంతానికి సిద్ధమైన టీఆర్‌ఎస్
-నేటినుంచి బీజేపీ సత్యాక్షిగహ దీక్షలు

డిసెంబర్ 9కి మూడేళ్లు! తెలంగాణ ఏర్పాటు ప్రకటన కేంద్రం నుంచి వెలువడిన మహత్తర సందర్భం! నిరుత్సాహ పర్చే శక్తులు చెప్పే మాట.. ఈ మూడేళ్లలో ఎక్కడేసిన గొంగళి.. అక్కడే ఉంది! కానీ.. వాస్తవం మాత్రం వేరేలా ఉంది! రాజకీయ ఎత్తులు.. ఉద్యమాల పోరుకేకలతో తెలంగాణం నినదిస్తోంది! ఉద్యమం పురుడుకు సిద్ధంగా ఉన్నది! నిదర్శనాలే.. మారుతున్న రాజకీయ పరిణామాలు.. వైఖరి మార్చుకుంటున్న రాజకీయ పార్టీలు! ఉద్యమశక్తులు మరింత బలపడ్డాయి! తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పథాన టీఆర్‌ఎస్.. దూసుకుపోతున్నది! ఇప్పుడు తెలంగాణలో గులాబీ గాలి! బీజేపీ.. మరింత బలపడే ప్రయత్నాల్లో నిమగ్నమైంది! జాతీయ స్థాయిలో సైతం ఆశలు రేకెత్తిస్తున్నది! తెలంగాణ కోసం తన వంతు పోరాటంలో సీపీఐ జనం మద్దతు పొంది.. అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచుకుంది! న్యూడెమోక్షికసీ ఉద్యమ సత్తాచాటుతున్నది! కొన్ని మినహాయింపులున్నా.. కాంగ్రెస్ నిట్టనిలువునా చీలిపోయి ఉంది! మొన్నటిదాకా తెలంగాణ వ్యతిరేక పార్టీలు.. టీడీపీ, వైఎస్సార్సీపీలు ఏదో ఒక రూపంలో తెలంగాణ అనుకూలత కనబర్చక తప్పని స్థితి! అనుకూలమని చెప్పడం లేదు కానీ.. వ్యతిరేకం అని ఘంటాపథంగా చెప్పుకోలేని పరిస్థితి! వ్యతిరేకమని చెప్పుకున్న సీపీఎం సైతం తెలంగాణపై సత్వరమే తేల్చి.. అనిశ్చితిని తొలగించాలంటూ వీలున్నప్పుడల్లా వాణి వినిపిస్తూనే ఉంది! ఇదీ మూడేళ్ల డిసెంబర్9 వార్షికోత్సవం సాధించిన ఘన విజయం!!

Srikantha-charyడిసెంబర్ తొమ్మిది! సరిగ్గా మూడేళ్ల క్రితం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. నెరవేరిన రోజు! దశాబ్దాల అణచివేత నుంచి.. దోపిడీ నుంచి.. తెలంగాణకు స్వేచ్ఛ సిద్ధించిన రోజు! వెక్కిరింతల నుంచి.. వెలి నుంచి విముక్తి కలిగిన అపురూప సమయం! పోరాటం ఫలితాన్ని రాబట్టిన జైత్ర సందర్భం! తెలంగాణ ఉద్యమ చరివూతలో నిజానికి అది మర్చిపోలేని మజిలీ! నిరాశలు నిండిన తెలంగాణ వీధుల్లో .. చాలా ఏళ్ల తర్వాత సంబురాలు అంబరాన్ని తాకిన ఉత్తేజం! యావత్ తెలంగాణ ప్రజానీకం అందుకే ఆ రోజుకు అంత విలువ ఇస్తుంది! అంతటి విలువైన రోజును గంటల వ్యవధిలోనే సీమాంధ్ర కుహనా సమైక్య శక్తులు నాశనం చేసేందుకు కుట్ర పన్నినా.. నాటి ప్రకటన వాస్తవరూపం దాల్చుతుందనే విశ్వాసంతో.. రాష్ట్రం సాధించుకుంటామనే ధీమాతో.. ఉద్యమపథానే పయనిస్తున్నది! ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణాలు.. కాకతీయ ప్రాంగణంలో కురిసిన వర్షాలు.. పది జిల్లల తెలంగాణలో ప్రతి పల్లెది పోరుబాటే! మూడేళ్లుగా ఉద్యమ ఘీంకారం! పల్లెపల్లె పట్టాలపైకి పోయిన సందర్భాలు! రాజధానిలో వంటావార్పు సెగలతో.. హస్తిన ముక్కుపుటాలకు తెలంగాణ ఘాటును తగిలించిన పొయ్యిలు! సర్కారీ కొలువుల్లోని తెలంగాణ జీతగాళ్లు కన్నెపూరజేసిన ఉద్యమంతో మహోన్నతంగా నిలిచి.. స్ఫూర్తినిచ్చిన సకల జనుల సమ్మె! మిలియన్‌మార్చ్‌లు.. సాగరహారాలు! లక్షల మందితో వందల పల్లెల్లో జన సభలు! దుమ్ము రేపిన ధూంధాంలు..! ఇప్పటికీ అదే స్పూర్తి! ఉద్యమం కోసం.. ఉద్యమంతో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం! మర్చిపోలేని మజిలీయే సందర్భం. అందుకే ఈ డిసెంబర్ 9న సకల ఉద్యమ శ్రేణులూ పోరాటానికి పునరంకితమవుతున్నాయి! రాజకీయ, ఉద్యమ పంథాలను మేళవించి.. పోరుమార్గంలో దూసుకుపోతున్నాయి!

డిసెంబర్ 9, 2009
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్ 9, 2009న అప్పటి కేంద్ర హోం మంత్రి
పీ చిదంబరం చేసిన ప్రకటన. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తాం. ఇందుకు తగిన తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. 2009 నవంబర్ నాటికి అందరు నాయకులు, విద్యార్థులు ఇతరులపై ఆందోళనకు సంబంధించి దాఖలైన కేసులను ఎత్తివేయాల్సిందిగా మేం రాష్ట్ర ముఖ్యమంవూతిని కోరాం. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి మాకు తెలిపారు. కే చంద్రశేఖర్‌రావు ఆరోగ్యంపై మేం ఆందోళన చెందుతున్నాం. ఆయన తన నిరశనను వెంటనే ఉపసంహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమం విరమించి, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు సహకరించాల్సిందిగా అందరికీ ప్రత్యేకించి విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నాం’’

sri-krishna-committeeడిసెంబర్ 23, 2009
డిసెంబర్ 9 ప్రకటన అనంతరం సీమాంవూధలోని వివిధ రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడబలుక్కుని రాజీనామాలు, ఆందోళనలకు దిగిన నేపథ్యంలో డిసెంబర్ 23న చిదంబరం చేసిన రెండవ ప్రకటన.
‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై 2009, డిసెంబర్ 7న ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఏకాభివూపాయం వ్యక్తమైంది. ఆ రోజు సమావేశం మినిట్స్ ఆధారంగా డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే, ఆ ప్రకటన తదుపరి రాష్ట్రంలో పరిస్థితి తారుమారైంది. అనేక రాజకీయ పార్టీలు ఈ అంశంపై చీలిపోయాయి. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, గ్రూపులతో విస్తృత స్థాయి సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. సంబంధిత అందరినీ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదే సమయంలో శాంతి సామరస్యాలు ఆంధ్రవూపదేశ్‌లో పునరుద్ధరించాలి. రాష్ట్ర ప్రభుత్వం పాలన, అభివృద్ధిపై దృష్టికేంవూదీకరించేందుకు వీలు కల్పించాలి. తమ తమ ఆందోళనలు విరమించి, శాంతి, సామరస్యం, సోదరభావం నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రవూపదేశ్‌లోని వివిధ ప్రాంతాల ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నది.’’

జూలై 4, 2011
విలేకరుల సమావేశంలో చిదంబరం వివరణ..
2009 డిసెంబర్ 9న తాను చేసిన ప్రకటన ఒక వ్యక్తి చేసింది కాదని, భారత ప్రభుత్వం తరపున చేసిందని హోం మంత్రి చిదంబరం నొక్కిచెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను కేంద్రం ప్రారంభిస్తుందని ఆ ప్రకటన పేర్కొంది. కానీ, కేంద్రం ఆ తర్వాత 2009 డిసెంబర్ 23న మరో ప్రకటన చేసింది. ఆ అంశంపై మరిన్ని సంప్రదింపులు అవసరమని తెలిపింది.
‘‘మీరు 2009 డిసెంబర్ 9నాటి నా ప్రకటన గురించి ప్రస్తావిస్తున్నప్పుడు, దయచేసి 2009 డిసెంబర్ 23నాటి ప్రకటన గురించి కూడా ప్రస్తావించండి’’ అని హోం మంత్రి చిదంబరం ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.

kcr-nimsతెలంగాణే ధ్యేయంగా.. ఉద్యమమే ఊపిరిగా..
నాటి కేసీఆర్ ఆమరణ దీక్ష నుంచి నేటి పల్లెబాట దాకా..
హైదరాబాద్, డిసెంబర్ 8 (టీ మీడియా):2009 నవంబర్ 29.. తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌తో ఆమరణ దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు బయలుదేరారు. మార్గమధ్యంలోనే పోలీసులు మానకొండూరు వద్ద ఆయనను అదుపులోనికి తీసుకుని ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. ఆ తర్వాత దీక్షను విరమింపజేసేందుకు ఎన్నో నాటకీయ పరిణామాలు. చివరకు డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలింపు. అప్పటినుంచి ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పట్టువీడని టీఆర్‌ఎస్ అధినేత. చివరకు.. రాష్ట్ర ప్రభుత్వ అభివూపాయాలు, అఖిలపక్ష నిర్ణయం మేరకు.. డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటన! దీంతో తెలంగాణ అంతటా ఆనందోత్సాహాలు. ఇది జరిగి ఆదివారానికి సరిగ్గా మూడు సంవత్సరాలు. ఆ తర్వాత రెండువారాలకే కేంద్రం మాటతప్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణ కోసం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఉద్యమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. నెలరోజులపాటు ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్ అధిష్ఠానం దూతలతో చర్చలు జరిపారు. ‘తెలంగాణ ఇస్తే సంబురాలు, లేకుంటే సమరమే’ అని ప్రకటించారు.

కాంగ్రెస్ మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. తెలంగాణ కోసం స్వీయ రాజకీయ అస్థిత్వాన్ని పెంపొందించుకునేందుకు అడుగులు వేస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు 40 రోజులపాటు పల్లెబాటను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్షికమం ద్వారా బూత్ కమిటీ స్థాయి నుంచి పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. 2014లోగా తెలంగాణను సాధించాలని, లేకుంటే రానున్న సాధారణ ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే, 16 ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాజకీయంగా తిరుగులేని శక్తిగా అవతరించాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్ ముందుకు సాగుతోంది.

JACసమరాంగణంలోటీ జేఏసీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుగా ఉద్యమించి పోరాడిన ఘనతను సాధించుకున్నప్పటికీ టీఆర్‌ఎస్ ఉద్యమ జ్వాలను ఆరిపోకుండా చూడటంలో అందరికీ సహకారాన్ని అందించింది. ఇందులో ప్రధానంగా పరిగణించాల్సింది సంయుక్త కార్యాచరణ కమిటీ (జాయింట్ యాక్షన్ కమిటీ- జేఏసీ) ఏర్పాటు. విశ్వవిద్యాలయ ఆచార్యుడు, హక్కుల నేత అయిన ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో జేఏసీ రూపొంది తెలంగాణ అంతటా చైతన్యస్ఫూర్తిని నింపింది. ఈ కమిటీ పిలుపు ప్రకారం టీఆర్‌ఎస్ సహా పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టాయి. రైల్‌రోకో, వంటావార్పూ వంటి కార్యక్రమాల్లో సబ్బండ వర్ణాలు పాల్గొన్నాయి. ఇక ఉద్యోగ సంఘాల ఉద్యమ ఉధృతీ ఊహించని స్థాయిలో కొనసాగడం తెలిసిందే. 42రోజులపాటు సాగిన సకల జనుల సమ్మె ఇందుకు తిరుగులేని దృష్టాంతం. ప్రభుత్వ నిర్బంధానికి భయపడకుండా, ఉద్యోగ భద్రతకోసం ఆరాటపడకుండా మడమ తిప్పని పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు ఉద్యోగులు. ఇప్పటికీ దేనికైనా సిద్ధంగానే ఉన్నామని ప్రకటిస్తున్నారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.