తెలంగాణ కంటే 17 చిన్న రాష్ర్టాలున్నయి-వినయ్ భాస్కర్

తెలంగాణ చిన్న రాష్ట్రం కాదని, తెలంగాణ కంటే 17 చిన్న రాష్ర్టాలు దేశంలో ఉన్నాయని వినయ్ భాస్కర్ చెప్పారు. తనను అసెంబ్లికి పంపి ఈ అవకాశం కల్పించిన వరంగల్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తనలో చైతన్యం కల్పించిన జయశంకర్‌సార్‌కు, జనార్ధన్‌సార్‌కు పాదాభి వందనం చేస్తున్నానని అన్నారు.
విలీనం సమయంలో చేసుకున్న ఏ ఒప్పందం అమలు కాలేదని ధ్వజమెత్తారు. ఆత్మగౌరవంతో బతికేందుకే రాష్ట్రం కోరుకుంటున్నామని తెలిపారు. పీజీ చదివిన వాళ్లు పాలమూరులో కూలి పని చేస్తున్నారు… ఇదా సమైక్య రాష్ట్రంలో అభివద్ధి అని అడిగారు. సమైక్య రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతాల్లో అంటురోగాలు అభివృద్ధి చెందాయని వినయ్ భాస్కర్ అన్నరు.

ఇక్కడ ఉపాధి లేక దుబాయి, మస్కట్ పోయి ఏజెంట్ల చేతిలో వలస జీవులు మోసపోవడం అభివృద్ధా అని అడిగారు. సమైక్య రాష్ట్రంలో నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిజాం స్థాపించిన ఫ్యాక్టరీలన్ని సమైక్య రాష్ట్రంలో అంతరించిపోయాయని తెలిపారు. కాజీపేట జంక్షన్‌ను డివిజన్ చేయలేదని ఇదా సమైక్య రాష్ట్రంలో అభివృద్ధా అని అడిగారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.