తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం

-ఈ సమావేశాల్లోనే ఆమోదించాలి: సుష్మాస్వరాజ్
నతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా బిల్లు తేవాలని యత్నిస్తున్నామని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా మంగళవారం స్పీకర్ వివిధ రాజకీయ పక్షాలతో జరిపిన సమావేశం అనంతరం ప్రధాని విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు విషయమై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ ‘మేం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. నూతన రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన శాసనపరమైన ప్రక్రియను త్వరగా పూర్తిచేసేందుకు కృషి జరుపుతున్నాం’ అని విలేకరులకు చెప్పారు. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తీసుకురావాలని స్పీకర్ సమక్షంలో జరిగిన సమావేశంలో వివిధ రాజకీయ పక్షాలనుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ విలేకరులకు చెప్పారు.

manmohan
అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపె అన్ని పక్షాలు అంగీకరించాయి. వీలైనంత త్వరగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటు ముందుకు తేవాలని ప్రభుత్వం కూడా యత్నిస్తోంది’ అని ఆయన చెప్పారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ స్పీకర్ సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తారు. ‘తెలంగాణ బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని’ ఆమె కోరారు. ఇదిలా ఉంటే 12 రోజుల పాటు జరిగే శీతాకాల సమావేశాలను పొడిగించాలని సమావేశానికి హాజరైన పక్షాలన్నీ ముక్తకం డిమాండ్ చేశాయి. 20వ తేదీన ముగిసే సమావేశాలను ఒక వారం విరామం అనంతరం తిరిగి జరపాలని ఆ పక్షాలు కోరాయి. రాజ్యసభ సభ్యులతో కూడా సంప్రదించిన అనంతరం ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.