హైదరాబాద్: మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు కారణంగా ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాబ్లీని నిలిపివేసి తెలంగాణ ఎడారిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన తెలిపారు. ఇవాళ బాబ్లీ ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాబ్లీతో సంబంధం లేకుండానే గోదావరిపై మాహారాష్ట్ర ప్రభుత్వ ఇప్పటికే పన్నెండ ప్రాజెక్టులు నిర్మించి 60 టీఎంసీలు నీటిని వాడుకుంటుందని ఆయన వివరించారు. మళ్లీ బాబ్లీ ప్రాజెక్టు నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. ఈ సమస్యను తమ టీఆర్ఎస్ పార్టీ 2005లోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, అయినా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.
తెలంగాణ ఎడారిగా మారుతుంది: పోచారం
Posted on March 28, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.