తెలంగాణ ఉద్యోగులపై దాడికి నిరసన

వరంగల్ : సీమాంధ్ర ప్రాంతంలో పనిచేస్తోన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వోద్యోగులపై దాడిని తెలంగాణ జేఏసీ జిల్లా విభాగం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేస్తే ఇక్కడ తీవ్ర పరిణామాలుంటాయని జేఏసీ నేతలు హెచ్చరించారు. ఈమేరకు ఇవాళ హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.