తెలంగాణ ఉద్యమకారులపై కొత్త కుట్రలు

తెలంగాణ ఉద్యమకారులపై కొత్త కుట్రలు- ‘సంసద్ యాత్ర’తో ఢిల్లీలో కదలికలు తేస్తాం
– తెలంగాణ జేఏసీ కో కన్వీనర్ శ్రీనివాస్‌గౌడ్
 తెలంగాణ ఉద్యమంలో చురుకైనపాత్ర పోషించే వారిపై కేసులు నమోదు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త రకం కుట్రలు చేస్తోందని తెలంగాణ జేఏసీ కో కన్వీనర్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. శనివారం దోమలగూడలోని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ చర్యలపై తిరగబడతామని, మరో సమ్మెకు సిద్ధమని హెచ్చరించారు. ఈ నెలాఖరులో ఢిల్లీ సంస్ధద్‌యాత్ర ద్వారా తెలంగాణ సత్తాను చాటుతామని, ఇచ్చిన మాట తప్పిన ప్రధానిని నిలదీస్తామన్నారు.

మత కల్లోలాలు సృష్టించాలని కుట్రలు చేశారు, ఉద్యమకారులను జైళ్ళలో పెట్టి అణచివేయాలని చూశారు, అన్ని విఫలం కావడంతో ఉస్మానియా యూనివర్సిటీలో కొత్త కుట్రలకు తెర లేపారని ధ్వజమెత్తారు. ఎప్పుడో వెలిసిన పొస్టర్లకు రెండు ఆంగ్ల పత్రికల్లో వార్తలు రాయించి.. ఓయూ విద్యార్థులు గెరిల్లా పద్ధతిలో ఉద్యమించనున్నారని కొత్త రకం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని సాధించుకుంటామని అన్నా రు. న్యాయం కోసం, ప్రజల ఆకాంక్ష కోసం పోరాడే వారిని, ఉద్యోగులను జైలుకు పంపిన చరిత్ర ఈ పాలకులదని మండిపడ్డారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.