తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది: కేకే

హైదరాబాద్: తెలంగాణ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత కే కేశవరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం అన్ని పార్టీలు కలిసి ఉద్యమిస్తాయని కేకే తెలిపారు. తెలంగాణ సాధన కోసం దేనికైనా సిద్ధమేనని ఆయన చెప్పారు. కాంగ్రెస్ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరితే తెలంగాణ ఉద్యమం మరింత బలపడుతుందని కేసీఆర్ అన్నారని కేకే పేర్కొన్నారు. కేసీఆర్ ఆలోచన సరైందేనని తామంతా భావిస్తున్నామని కేకే తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.