‘తెలంగాణ ఆరు దశాబ్దాల ఆకాంక్ష

‘తెలంగాణ ఆరు దశాబ్దాల ఆకాంక్ష అని రాజ్ నాథ్ అన్నరు. ఆంధ్రప్రదేశ్ విభజనకు తాము పూర్తి మద్దతు ఇస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. ఆయన మాటల్లో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చాలా కాలం నుంచి ఉద్యమాలు చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఇస్తాం. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును సమర్థిస్తాం. సీమాంధ్ర అభివృద్ధికి కూడా కేంద్రం కట్టుబడి ఉండాలి. సీమాంధ్రలో అనిశ్చితి కొనసాగుతోంది. సీమాంధ్రులకు భద్రతా చర్యలు తీసుకోవాలి. రాజకీయ లబ్ధి కోసం నిర్ణయం తీసుకోలేదు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరిస్తాం. తెలంగాణను అడ్డుకునే సీమాంధ్ర నేతల చర్యలకు మద్దతివ్వం.
బిల్లు వచ్చాకే హైదరాబాద్‌పై స్పందిస్తాం
పార్లమెంట్‌కు తెలంగాణ బిల్లు వచ్చిన తర్వాతే హైదరాబాద్‌పై స్పందిస్తాం. తెలంగాణ విషయంలో ఎన్ని ప్రశ్నలు అడిగినా బీజేపీ సమాధానం ఒక్కటే. అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే బీజేపీ స్టాండ్. తెలంగాణను ఏర్పాటు చేసేంత వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తాం.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.