తెలంగాణ ఆకాంక్షనే చెప్పాలి

– 26న మండల కేంద్రాల్లో ధర్నాలు
– 27న హైదరాబాద్‌లో మహాధర్నా
– 28న ఢిల్లీలో దీక్షలు
– 29న ప్రతిస్పందన రాజకీయ కార్యాచరణ
– విమలక్కను బేషరతుగా విడుదల చేయాలి
– తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
TJACఅఖిల పక్ష సమావేశానికి హాజరవుతున్న రాజకీయ పార్టీల నాయకులందరూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను మాత్రమే తెలియచెప్పాలనే డిమాండ్‌తో ఈ నెల 28 నుంచి తెలంగాణ జేఏసీ కార్యాచరణ సిద్ధం చేసింది. 26న తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, 27న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. బుధవారం తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశంపైసమావేశంలో చర్చించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో 23, 24 తేదీల్లో ఆందోళన కార్యక్షికమాలు ప్రకటించామని, క్రిస్‌మస్ ఉండటంతో 26, 27 తేదీలకు ఆ ఆందోళనలను వాయిదా వేశామని చెప్పారు. 28న ఢిల్లీలో తెలంగాణ జేఏసీ సారథ్యంలో జంతర్‌మంతర్ వద్ద దీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆ రోజున జరిగే అఖిలపక్షంలో రాజకీయ నాయకులు ప్రకటించే వైఖరిని అనుసరించి 29న ప్రతిస్పందనలతో మరోసారి ఆందోళనా కార్యక్షికమాలను ప్రకటిస్తామని వివరించారు.

చంద్రబాబుకు అఖిలపక్షం మంచి అవకాశం
టీడీపీ అధినేత చంద్రబాబు చాలా సందర్భాల్లో అఖిలపక్షాన్ని ఏర్పరిస్తే అభివూపాయాన్ని వివరిస్తామని ప్రకటించారని కోదండరాం గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తెలియజెప్పే అవకాశం వచ్చిందని, ఆయన నిక్కచ్చిగా, నిజాయితీగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అఖిలపక్షంలో చెప్పాలన్నారు. ఇంతవరకు అభివూపాయం ప్రకటించకుండా దోబూచులాడుతున్న కాంగ్రెస్‌ను చంద్రబాబు నిలదీయాలని కోదండరాం డిమాండ్ చేశారు. సమావేశం నుంచి తెలంగాణ ప్రజలకు కావాల్సిన సానుకూల స్పందనలు లభిస్తాయన్న ఆశ లేనప్పటికీ, రాజకీయ పార్టీల రంగులను తెలుసుకునేందుకు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారని చెప్పారు.

ములాఖత్‌ను అడ్డుకోవద్దు
తెలంగాణ రాజకీయ ప్రజా ప్రతినిధులను కలుసుకునే ములాఖత్ కార్యక్షికమం ప్రారంభ సందర్భంలో సంగాడ్డి డీఎస్పీ వ్యవహరించిన తీరు దురుసుగా ఉందని ఆరోపించా రు. తెలంగాణ జేఏసీ ఇచ్చిన కార్యక్షికమం ప్రకారం అన్ని జిల్లాల్లో ములాఖత్ ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులను అక్కడి జేఏసీ నాయకులు కలుస్తారని చెప్పారు. ఈ కార్యక్షికమాన్ని అడ్డుకోవద్దని కోదండరాం పోలీసులకు విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న తెలంగాణ జేఏసీ కార్యాచరణను నిరంకుశంగా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇది సరైన విధానం కాదన్నా రు. ఈ వైఖరి కొనసాగిస్తే ఆందోళన లు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు.

అఖిల పక్ష సమావేశానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ హోదాలో తాను వెళ్లాలన్న ప్రతిపాదనపైన చర్చ జరిగిందని, తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఉపాధ్యక్షురాలు విమలక్కను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై కొనసాగుతున్న రాజ్యహింసకు ఇది ఒక ఉదాహరణ అని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోని రాజకీయ పార్టీలపైన, శ్రేణులపైన పాలకులు కొనసాగించే నిర్భందానికి వ్యతిరేకంగా జేఏసీ ఉద్యమిస్తుందని కోదండరాం పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, తెలంగాణ ధూంధాం వ్యవస్థాపక అధ్యక్షుడు రసమయి బాలకిషన్, ఇంజినీరింగ్ జేఏసీ వెంక అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌డ్డి, న్యూడెమొక్షికసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కే గోవర్ధన్ పాల్గొన్నారు.

కోదండరాం వెళ్ళకపోవడమే ఉత్తమం
– టీ జేఏసీ సమావేశంలో అభివూపాయం
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం వెళ్లకపోవడమే మంచిదని బుధవారం జరిగిన సమావేశంలో అభివూపాయం వ్యక్తమయింది. ఆయన మొత్తం తెలంగాణ పౌర సమాజానికి ప్రతినిధి అని, ఆ హోదా రాజకీయ పార్టీల పదవులన్నింటికన్నా ఉన్నతమైనదని సమావేశం అభివూపాయపడింది. టీఆర్‌ఎస్ అధినేత ఆహ్వానాన్ని స్వాగతిస్తూనే, మరింత లోతుగా ఈ అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఉన్నదని అభివూపాయపడింది. కోదండరాం అఖిలపక్ష భేటికీ హాజరైతే మిత్రులకు నష్టం జరుగుతుందని, శత్రువులకు ఆయుధం లభిస్తుందన్న అభివూపాయం వ్యక్తమైంది.

22న తెలంగాణ ధూంధాం దశాబ్ది ఉత్సవాలలో కీలక పాత్ర పోషించాలని, 23న విద్రోహదినాన్ని తెలంగాణవ్యాప్తంగా జరుపాలని నిర్ణయించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్పీపీల వైఖరిని 26, 27 తేదీల్లో తీవ్రంగా ఎండగట్టాలని, ములాఖత్‌లో తెలంగాణ రాజకీయ పార్టీలందరినీ కలుసుకోవాలని అనుకున్నారు. విమలక్క నిర్బంధంపై విస్తృతంగా ప్రచారం చేయాలని, ఆమెను విడుదలకోసం ఉద్యమిస్తున్న పార్టీలకు సంఘీభావం తెలియజేయాలని నిర్ణయించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.