తెలంగాణ ఆకాంక్షకే పట్టం

తెలంగాన ఆకాంక్షకు .. హెడ్‌లైన్స్‌ టుడే సీ ఓటర్ సర్వే అద్దం పట్టింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో ఉద్యమపార్టీ టీఆరెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయమని .. హెడ్‌లైన్స్‌ సర్వే తేల్చిచెప్పింది. తెలంగాణలో తిరుగులేని శక్తి గా మారిన టీఆరెస్‌.. ఏకంగా 12 ఎంపీ స్థానాలు దక్కించుకోవడం గ్యారెంటీ అని స్పష్టం చేసింది. ఎలెక్షన్స్‌ నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నదని సూచించింది. అటు .. గత ఎన్నికల్లో 34 ఎంపీ స్థానాలతో టాప్‌గా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ.. ఈ సారి సింగిల్‌ డిజిట్‌ కే పరిమతమవుతదని జోస్యం చెప్పింది. తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి.. దగాచేసిన హస్తం పార్టీకి అతికష్టం మీద 7 స్థానాలొస్తే మహా గొప్పేనంది. 11 స్థానాలతో వైఎస్సార్‌ సీపీ సెకెండ్ ప్లేస్‌ లో   నిలుస్తదని తెలిపింది. గత సర్వేలతో పోలిస్తే.. ఇది పూర్తి గా భిన్నమైన ఫలితం. వైస్సార్‌సీపీ ప్రాభవం కోల్పోతున్నదన్నది స్పష్టం చేయడంతోపాటు.. తెలంగాణలో ఆ పార్టీకి ఎలాంటి ఆదరణ లేదని చాటింది. ఇక పడీపడీ నడిచినా చంద్రబాబుకు .. ఎంపీ ఎలెక్షన్స్‌లోనూ మూడో స్థానమేనని సర్వే కుండబద్ధలు కొట్టింది.  టీడీపీ 10 సీట్లు రావొచ్చన్నది.  ప్రస్తుతం ఉన్న నేతలను బట్టి ఈ ఫలితాలన్న సర్వే.. వలసులు ఇదే రకంగా ఉంటే సంఖ్య మరింత తగ్గొచ్చని సూచించింది.
ఎంఐఎం 1, బీజేపీ 1 స్థానానికే పరిమితమని సర్వే విశ్లేషించింది.

రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ టీఆర్‌ఎస్ కారు జోరు

రెండోస్థానంలో వైఎస్సార్సీపీ
– పది సీట్లకు పెరుగనున్న టీడీపీ
– కాంగ్రెస్‌కు దారుణ పరాజయం
అసెంబ్లీలో హంగ్ తప్పదు!
తెలంగాణపై మోసం చేస్తున్న కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్ చావుదెబ్బ కొట్టబోతున్నదా? రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చిన్న పార్టీలు పెద్ద సంచులతో రాబోతున్నాయా? కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో యూపీఏకు, ఎన్డీయేకు అధికార అవకాశాలను నిర్దేశించనున్నాయా? అవుననే సంకేతాలు వస్తున్నాయి. యూపీఏ-2 అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సర్వే నిర్వహించాయి. దాని ఫలితాలను మంగళవారం విడుదల చేశాయి. ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే యూపీఏ సంఖ్యాబలం గణనీయంగా తగ్గిపోతుందని సర్వేలో మెజార్టీ ఓటర్లు అభివూపాయపడ్డారు. అదే సమయంలో యూపీఏ పతనం ఎన్డీయే విజయావకాశాలను మెరుగుపర్చదంటూ ఆశ్చర్యకరమైన అంశాన్ని సర్వే ప్రకటించింది. ఈ రెండు పార్టీల నష్టాల నుంచి దేశంలోని చిన్న పార్టీలే లబ్ధి పొందనున్నాయని సర్వే తేల్చింది. అయితే 137 స్థానాలతో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని పేర్కొంది. కేంద్రంలో అధికారం సాధించాలంటే మ్యాజిక్ ఫిగర్ 273 స్థానాలు. రాష్ట్రం విషయానికొస్తే ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న టీఆర్‌ఎస్.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించనుందని సర్వే తెలిపింది. టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ బలం 12కు చేరుకుంటుందని సర్వే పేర్కొంది.

తర్వాతి స్థానంలో అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం చెంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌మోహన్‌డ్డికి చెందిన వైఎస్సార్సీపీ నిలువనుంది. రాష్ట్రంలో తమ హవాయే వీస్తున్నదని చెబుతున్న వైఎస్‌ఆర్సీపీకి 11 స్థానాలే దక్కుతాయని తెలిపింది. ప్రస్తుతం 6స్థానాలున్న టీడీపీకి మెరుగైన ఫలితాలు వచ్చి.. 10 స్థానాలు లభిస్తాయని సర్వే తెలిపింది. ఈ ఫలితాలను బట్టి చూస్తే దారుణంగా నష్టపోనున్నది అధికార కాంగ్రెసే. ఈ పార్టీకి గతంలో 32 స్థానాలు ఉండగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని తెలిపింది. ఎంఐఎం తన స్థానాన్ని నిలుపుకుంటుందని, బీజేపీ 1 స్థానంతో బోణీ కొడుతుందని పేర్కొంది. హెడ్‌లైన్స్ సర్వే నిజమైన పక్షంలో టీఆర్‌ఎస్ తాను ఆశిస్తున్న 100 అసెంబ్లీ, 15 లోక్‌సభ స్థానాల లక్ష్యానికి అంత్యంత చేరువగా వెళ్లినట్లే! లోక్‌సభ స్థానాల్లో ఆయా పార్టీల విజయాలను అంచనా వేస్తే.. అసెంబ్లీలో ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజార్టీ సాధించే అవకాశాలు లేనట్లే! అంటే రాష్ట్రంలో హంగ్ తప్పదన్నమాట!

చిన్నపార్టీలే కింగ్‌మేకర్లు
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చిన్న పార్టీలే కేంద్రంలో అధికారం ఎవరు చేపట్టాలన్నది నిర్ణయిస్తాయని హెడ్‌లైన్స్-సీ ఓటర్ సర్వే తేల్చింది. మార్చి-మే నెలల మధ్యకాలంలో హెడ్‌లైన్స్‌టుడే- సీ వోటర్ ఈ సంయుక్త సర్వేను నిర్వహించాయి. దేశవ్యాప్తంగా 540 లోక్‌సభ నియోజకవర్గాల్లో 1.20 లక్షల మందిని ఇంటర్వ్యూ చేసి, ఈ ఫలితాలను వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లో నరేంవూదమోడీ పాత్రను అంచనా వేసిన సర్వే.. విచివూతమైన అంశాన్ని బయటపెట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 137 స్థానాలు వస్తాయని సర్వే పేర్కొంది. ఒకవేళ మోడీని బీజేపీ తన ప్రధాన మంత్రి అభ్యర్థిగా ముందుకు తెస్తే.. అటు ఎన్డీయేకు, ఇటు యూపీఏకు సీట్లు పెరుగుతాయని అంచనా వేసింది. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఎన్డీయే వెలుపలే కాకుండా, జేడీయూ వంటి ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో మోడీ అభ్యర్థిత్వం ప్రతికూల ప్రభావం చూపి.. యూపీఏకు కొంత సంఖ్యలో సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని సర్వే అంచనా వేసింది. అదే సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఆ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో మోడీ ప్రభావం సానుకూల ఫలితాలు తెచ్చి..

ఎన్డీయేకు పెరిగే స్థానాల సంఖ్యను రెట్టింపు చేసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంది. గణాంకాల్లో చూస్తే.. మోడీ ప్రధాని అభ్యర్థిగా ఉన్న పక్షంలో యూపీఏకు అదనంగా 23 సీట్లు దక్కే అవకాశం ఉంది. అదే ఎన్డీయే విషయానికి వస్తే 41 స్థానాల అదనంగా లభిస్తాయి. ఇందులో ఒక్క బీజేపీ బలమే 220కి చేరుకుంటుంది. మొత్తంగా దేశవ్యాప్తంగా చిన్న పార్టీల (కూటమి) ఎంపీల సంఖ్య 6దాకా ఉండొచ్చని సర్వే పేర్కొంది. ఎన్డీయేకు గతంలో ఉన్నవాటికంటే 27 సీట్లు అదనంగా పెరుగుతాయని తెలిపింది. కాంగ్రెస్ 2009లో 206 స్థానాల్లో గెలువగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 90 స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షం ఎన్సీపీకి గతంలో 9 సీట్లు ఉండగా.. ఇప్పుడు దానికి 3 సీట్లే వస్తాయని తెలిపింది. బీజేపీ విషయంలో ఆ పార్టీకి ప్రస్తుతం 116 సీట్లు ఉండగా.. అవి 137కు చేరుతాయని వెల్లడించింది. కాంగ్రెస్ 116 స్థానాలతో రెండో స్థానంలో నిలుస్తుంది.

ఇక ఇతర రాష్ట్రాల విషయానికొస్తే.. బీజేపీ పాలిత గుజరాత్‌లో అధికార పార్టీకే అధిక స్థానాలు వస్తాయని సర్వే పేర్కొంది. ప్రస్తుతం 15 స్థానాలు ఉన్న బీజేపీకి ఈ రాష్ట్రంలో 20కి పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుటుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్.. ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే అదే ఊపులో ఎంపీ స్థానాలను సైతం గెల్చుకుంటుందని సర్వే అంచనా వేసింది. ప్రస్తుతం ఆ పార్టీకి ఆరు స్థానాలు ఉండగా.. అవి 1కి పెరుగుతాయని పేర్కొంది. 2009లో బీజేపీ 19 సీట్లు గెలువగా.. ఇప్పుడు 7 సీట్లకు పరిమితమవుతుందని తెలిపింది.

ఎన్డీయేతో కలిసి కొనసాగితే జేడీయూ మళ్లీ మ్యాజిక్ చేసి.. 19 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బీజేపీకి 11 స్థానాలు దక్కుతాయని తెలిపింది. లాలు యాదవ్ నిర్వహించిన పరివర్తన్ ర్యాలీ కారణంగా ఆ పార్టీకి అదనంగా 2 స్థానాలు దక్కి.. ఆ పార్టీ ఎంపీల సంఖ్య ఏడుకు చేరుకుంటుందని పేర్కొంది. మోడీ అంశంపై విభేదించి బీహార్‌లో ఎన్డీయే నుంచి జేడీయూ వేరుపడితే.. ఆ పార్టీ గెలిచే ఎంపీల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని సర్వే పేర్కొనడం విశేషం. జేడీయూను వదులుకుని మోడీ పక్షాన బీజేపీ నిలిస్తే బీహార్‌లో ఆ పార్టీకి 1 స్థానాలు వస్తాయని తెలిపింది.

మధ్యవూపదేశ్‌లోనూ బీజేపీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఇక్కడ బీజేపీకి 16 స్థానాలు ఉండగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ సంఖ్య 19కి పెరుగుతుందని పేర్కొంది. మొత్తం 29 స్థానాలు ఉన్న మధ్యవూపదేశ్‌లో కాంగ్రెస్ గతంలో ఉన్న 12 స్థానాల నుంచి 9 స్థానాలకు తగ్గిపోతుందని చెప్పింది.

యూపీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కరిష్మా పని చేయదని, ఆ పార్టీ గతంలో ఉన్న 21 స్థానాల నుంచి 7 స్థానాలకు పరిమితమవుతుందని తెలిపింది. ఇక్కడ అతిపెద్ద లబ్ధిదారు సమాజ్‌వాది పార్టీయేనని తెలిపింది. ఆ పార్టీకి ప్రస్తుతం 22 మంది ఎంపీలు ఉండగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వారి సంఖ్య 29కి పెరుగుతుందని సర్వే వెల్లడించింది. బీజేపీ కూడా కొంత మెరుగుదలను సాధించి 4 సీట్లు గెలుపొందుతుందని బీఎస్పీకి అదనంగా 7 స్థానాలు దక్కుతాయని తెలిపింది.
మహారాష్ట్రలో అధికార కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి సర్వే చేదువార్తనే వినిపించింది. ఇక్కడ యూపీఏ కూటమి 7 స్థానాలు కోల్పోతుందని, బీజేపీ-శివసేన కూటమి తన బలాన్ని 20 నుంచి 25కు పెంచుకుంటుందని సర్వేలో తేలింది.

ప్రభుత్వ వ్యతిరేక పవనాలు మెల్లగా వీస్తున్నప్పటికీ.. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ తన సంఖ్యను మెరుగుపర్చుకోనుంది. ప్రస్తుతం ఉన్న 19 స్థానాలకు గాను ఆ పార్టీకి 23 సీట్లు లభిస్తాయి. 2009లో సాధించిన 19 స్థానాలు కాంగ్రెస్ పొత్తుతో గెలిచినవి కావడం ఇక్కడ గమనార్హం. వామపక్షాలు ఇక్కడ 15 చోట్ల గెలుపొందే అవకాశం ఉందని సర్వేలో ఓటర్లు అభివూపాయపడ్డారు. కాంగ్రెస్ స్థానాలు ఆరు నుంచి మూడుకు పడిపోతాయని, బీజేపీకి ఒక్క సీటు కూడా ఇక్కడ దొరకదని సర్వే తేల్చింది.
తమిళనాడు విషయానికొస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో జయలలిత స్వీప్ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 9 స్థానాల నుంచి ఏకంగా 30 సీట్లకు ఎదుగుతుందని తెలిపింది. అంటే ఏకబిగిన 21 స్థానాలు కొత్తగా గెలుస్తుందన్నమాట. 2009లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని డీఎంకే సాధించుకున్న 1 స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మిగిలేవి నాలుగేనని పేర్కొంది.

అటు ఢిల్లీలోనూ, ఇటు రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బలే పొంచి ఉన్నాయని సర్వే వెల్లడించింది. ఢిల్లీలో షీలాదీక్షిత్ పాలనకు బీజేపీ ఫుల్‌స్టాప్ పెడుతుందన్న అంచనాలు సర్వేలో వెల్లడయ్యాయి. 2009లో ఒక్క స్థానం కూడా గెలువని బీజేపీకి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 6 స్థానాలు వస్తాయని తెలిపింది.

రాజస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీచి.. అశోక్‌గెహ్లాట్ ప్రభుత్వానికి ముప్పు తెస్తాయని పేర్కొంది. 2009లో 20 స్థానాల్లో విజయం సాధంచిన కాంగ్రెస్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని తెలిపింది. అదే సమయంలో 2009లో 4 సీట్లు గెలిచిన బీజేపీ.. 17 స్థానాలకు పెరుగుతుందని పేర్కొంది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.