మనీ, మగువలతో అధిష్టాన పెద్దలను మేనేజ్ చేసిన సీమాంధ్ర నేతలు

మనీ, మగువలతో ఢిల్లీలో లాబీయింగ్ చేసిన సీమాంధ్ర నేతలు సక్సెస్ అయ్యిన్రు. అధిష్టానం పెద్దల వీక్ నెస్ ను బట్టి కొందరికి అమ్మాయిలను, మరికొందరికి మనీని పంపిణీ చేసి పంతం నెగ్గించుకుని తెలంగాణను అడ్డుకున్నారని టీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నరు.

దీని ఫలితంగానే తెలంగాణ సమస్య పరిష్కారానికి డెడ్‌లైన్ లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ తెలిపారు. సమస్య పరిష్కారానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని, తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే సమస్య పరిష్కారం జరుగుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో తాను చెప్పలేనని అన్నారు. నెల రోజులంటే 30 రోజులు కాదని, కొంత సమయం పడుతుందన్నారు. సున్నితమైన, తీవ్రమైన సమస్య.. మరికొన్ని సంప్రదింపులు జరపాల్సి ఉందని తెలిపారు. వారమంటే ఏడు రోజులే కాదు, రెండు వారాలు కూడా పట్టొచ్చన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

One Response to మనీ, మగువలతో అధిష్టాన పెద్దలను మేనేజ్ చేసిన సీమాంధ్ర నేతలు

  1. avunu annaya manam nethalaku 0.5 lanu pampudham