తెలంగాణవ్యాప్తంగా బంద్ ప్రశాంతం

హైదరాబాద్ : ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ టీఆర్‌ఎస్ పిలుపునిచ్చిన తెలంగాణ బంద్ విజయవంతమైంది. చలో అసెంబ్లీ ముట్టడిలో అక్రమ అరెస్టులను నిరసిస్తూ తెలంగాణవాదులు పది జిల్లాల్లో రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. పలు చోట్ల ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి కాంగ్రెస్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. కూడళ్లల్లో జై తెలంగాణ నినాదాలు మార్మోగాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌కు పూర్తిగా సహకరించాయి. పది జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. తెలంగాణవాదులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణవాదులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.