తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్ బైక్ ర్యాలీ

తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోరుతూ కార్యకర్తలు, తెలంగాణవాదులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ భవన్ వద్ద పార్టీ నేత నాయిని నర్సింహారెడ్డి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో మెదక్ ఎంపీ విజయ శాంతితోపాటు టీఆర్‌ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ సాధనే లక్ష్యంగా చేపట్టిన బైక్ ర్యాలీల్లో తెలంగాణ 10 జిల్లాల్లో యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, వైద్యులు, న్యాయవాదులతోపాటు తెలంగాణవాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రధాన వీధుల గుండా ర్యాలీలు తీశారు. తెలంగాణ పల్లెలు, పట్టణాల్లోని గల్లీలు గులాబీ మయమయ్యాయి. జైతెలంగాణ నినాదాలతో మారుమోగాయి.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.