తెలంగాణవాదుల పార్లమెంట్ ముట్టడి


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జైతెలంగాణ నినాదాలతో మారుమోగుతోంది. తెలంగాణ వాదులు తమ తడాఖా చూపించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని పార్లమెంట్‌ను ముట్టడించేందుకు వెళ్లి తమ సత్తాను చాటారు. ‘సంసద్‌యాత్ర’ ముగిసిన అనంతరం జంతర్‌మంతర్ నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు బయలుదేరి పార్లమెంట్ వైపు దూసుకు పోయేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. జైతెలంగాణ నినాదాలు చేస్తూ పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలిగిస్తూ పార్లమెంట్ వైపు దూసుకు పోతున్నారు. పోలీసులు తెలంగాణ వాదులను అడ్డుకునేందుకు ప్రయత్రించారు. దీంతో అక్కడ ఉధ్రిక్తత చోటుచేసుకుంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.