తెలంగాణవాదులు రోగాలొచ్చి చనిపోయారట.. అవి బలిదానాలు కావన్న రేణుకాచౌదరి!

(పోరుతెలంగాణ శ్రీనివాస్‌):  రేణుకా చౌదరి మరోసారి తనది ఆంధ్రా బ్లడ్డేనని నిరూపించుకున్నది. తెలంగాణ అమరవీరులపై అడ్డగోలుగా మాట్లాడింది. టీబీ, పోలియో, క్యాన్సర్, గుండె జబ్బుల్లాంటి రోగాలతో కొందరు చనిపోతే, నక్సలైటు కాల్పుల్లో మరికొందరు చనిపోయారని.. అవి ఆత్మబలిదానాలు కావని రేణుక చౌదరి అన్నది.   శ్రీకాంతాచారి, యాదన్న ఏ రోగంతోని  చనిపోలేదు. నీకు లాగా వాళ్లు వయసుమళ్లినవాళ్లు కాదు.. రోగాలతో బాధ పడటానికి.. యువరక్తంతో ఉత్సాహంగా ఉన్న యువకులు వాళ్లు.. వందలాది మంది సమక్షంలో నిప్పు నిలువునా దహిస్తున్నా జై తెలంగాణ అని నినదించిన తెలంగాణ బిడ్డలు వాళ్లు.. వీళ్లలాగే వెయ్యి మంది వరకు తెలంగాణ బిడ్డలు ప్రత్యేకరాష్ట్రం రావడంలేదని బలిదానాలు చేసిన్రు.  ఉరేసుకుని.. మందుతాగి.. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి.. బస్సుకు ఎదురుగా వెళ్లి జై తెలంగాణ అని నినదిస్తూ అసువులు బాసిన్రు. మా తెలంగాణ అమరవీరులనే అవమానిస్తవా..? నీది నోరా మోరా? విశాఖపట్నంల పుట్టి.. నేను ఖమ్మం ఆడబిడ్డని.. తెలంగాణ బిడ్డని అని ఎందుకు చెప్పుకుంటవు..  నక్సలైట్లు తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన్రా? ఎప్పుడు చంపిన్రు..  మా అమరవీరుల ఆత్మలను క్షోభపెట్టిన నువ్వు బాగుపడువుగాక బాగుపడవ్‌..

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.