తెలంగాణవాదానికే ‘జై’

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంత ప్రజలు తెలంగాణవాదానికే పట్టం కట్టారనే అభివూపాయాలు బలపడుతున్నాయి. టీ కాంగ్రెస్‌లో కొందరు నేతలు సైతం ఇటీవలి ఎన్నికల తీరును విశ్లేషించి ఇది స్పష్టమయిందని అంటున్నారు. సహకార ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో కూడా పార్టీ గెలిచిందని, తెలంగాణవాదం లేదంటూ ఎగిరి గంతులేస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు తాజాగా తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ, పట్టభవూదుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీర్పు చెంపపెట్టు లాంటిదని వారు పేర్కొంటున్నారు.

పార్టీల సంగతి ఎలా ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల నేపథ్యంలోకి వెళితే వారు తెలంగాణ ఉద్యమంలో, ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో కీలకపాత్ర పోషించినవారేనని టీ కాంగ్రెస్ నేతలు కొందరు అంగీకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణవాదం లేదని వాదనలు వినిపించేవారిని అవివేకులుగా, మూర్ఖులుగానే పరిగణించాల్సి ఉంటుందని వారంటున్నారు.

మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభవూదుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన కే స్వామిగౌడ్ 48,470 ఓట్లు సాధించారు. ఇక్కడ చెల్లుబాటు అయిన ఓట్లు 52,297 ఓట్లు కాగా, వాటిలో ఆయనకు 48,470 ఓట్లు లభించడం గమనార్హం. 92 శాతానికి పైగా ఓట్లు సాధించి స్వామిగౌడ్ మాజీ ప్రధాని అటల్‌బిహారి వాజ్‌పేయి రికార్డును అధిగమించడం గమనార్హం. ప్రత్యర్థులు బలమైనవారు కాదనే విషయం పక్కనపెడితే, తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ కీలక పాత్ర పోషించారు కనుకనే పట్టభవూదులు ఆయకు జై కొట్టారని టీ కాంగ్రెస్ నేతలు కొందరు విశ్వసిస్తున్నారు. అదే విధంగా మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన పాతూరి సుధాకర్‌డ్డి 9,324 ఓట్లు దక్కించుకుని విజేతగా నిలిచారు. ఈ ప్రాంతానికి సుధాకర్‌డ్డి స్థానికేతరుడు. ఆయనకు సమీప ప్రత్యర్థిగా పోటీచేసిన బీ మోహన్‌డ్డి స్థానికుడై, సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ పరాజయం పొందడం చూస్తే తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందనే విషయం సుస్పష్టమైందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు పేర్కొనడం గమనార్హం.

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన ఏ వరదాడ్డి ఓటమి పాలు కావడం, పూల రవీందర్ 9,139 ఓట్లు సాధించి గెలుపొందడం చూస్తే ఇక్కడ కూడా ఓటర్లు తెలంగాణవాదానికే పట్టం కట్టారనే విషయం బహిర్గతమైందని ఆ నేత అభివూపాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో రవీందర్ చురుకుగా పాల్గొన్నారని, ప్రత్యేకించి ఉపాధ్యాయ జేఏసీలో తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తూ కీలకపాత్ర పోషించారని, దాన్ని చూసే ఓటర్లు తీర్పునిచ్చారని, ఇక్కడ టీఆర్‌ఎస్ పార్టీ ఓడినా, తెలంగాణవాదం నెగ్గిందని, తెలంగాణకోసం గట్టిగా కృషిచేసినవారికే ఓటర్లు అండగా నిలిచారని పేర్కొన్నారు. సహకార ఎన్నికలు పార్టీ గుర్తుపై జరిగిన ఎన్నికలు కావని, నాలుగు గ్రామాలు కలుపుకుని సొసైటీ కోసం జరిగే ఎన్నికల్లో స్థానిక పరిస్థితులు, డబ్బు, పలుకుబడి వంటివి ప్రభావం చూపుతాయని, అంతమావూతానే జనం తమ ఉన్నారనుకోవడం సరికాదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తేలుతుంది కదా అని ముక్తాయించారు. తెలంగాణవాదం లేదంటున్నవారికి రాబోయే ఎన్నికలే గుణపాఠం చెబుతాయని టీ కాంగ్రెస్ కీలకనేత మరొకరు వ్యాఖ్యానించారు. ఇప్పట్లో అవిశ్వాస తీర్మానానికి ఎవరూ సాహసం చేయబోరని, పెట్టినా కాంగ్రెస్ నెగ్గుతుందని, 2014 వరకు ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగితే టీడీపీకి కొంత వరకు లాభం ఉంటుందని, అందువల్ల వైఎస్సార్సీపీ బలపడాలని టీడీపీ ఏనాడూ కోరుకునే అవకాశం కూడా ఉండదని తన అభివూపాయాన్ని వ్యక్తం చేశారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.