తెలంగాణలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్, ఎంఐఎం కుట్ర-కేటీఆర్

నాడు వైఎస్ నేడు జగన్ తెలంగాణలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారని టీఆర్ఎష్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డరు. ఎంఐఎంను అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ శిఖండి రాజకీయం చేస్తున్నాడని కే తారకరామారావు అన్నారు. అక్బరుద్దీన్ వాఖ్యలు తదనంతర పరిణామాల కుట్రకోణంపై దర్యాప్తు చేయాలని, ప్రజలు వీరి ప్రకటనలకు మోసపోకుండా సంయమనం పాటించాలని ఆయన హెచ్చరించారు.  ఈ వ్యవహారంపై విచారణ జరిపి దీని వెనుక జగన్ ఉన్నాడా, కేవీపీ ఉన్నాడా తేల్చాలన్నారు. కేంద్ర మంత్రి షిండే ప్రకటన అనంతరం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఢిల్లీ స్థాయిలో అడ్డుకునే ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో సీమాంధ్ర నాయకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారని ఆరోపించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.