తెలంగాణపై వాయలార్ పరాచికాలు

– తెలంగాణ ఇవ్వడం
దోశ వేసినంత ఈజీకాదు
– వివాదాల వాయలార్ తాజా వ్యాఖ్య
తెలంగాణ విషయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి మరోసారి నోరు పారేసుకున్నారు. తెలంగాణ ఆకాంక్షను దోశతో పోల్చారు. అడగ్గానే వేసివ్వడానికి ఇది దోశ కాదని అన్నారు. సోమవారం ఢిల్లీలోని ఓ హోటల్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఈ కేరళ తిండిబోతు, తిరుగుబోతు వాయలార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ విషయంలో రాజకీయ పార్టీలకన్నా మీడియాకే ఎక్కువ శ్రద్ధ ఉన్నట్లుంది. మీరు ఎన్నిసార్లు అడిగినా.. నా సమాధానం ఒక్కటే. తెలంగాణపై విస్తృత చర్చ, సంప్రదింపులు జరుగుతున్నాయి. సరైన సమయంలో నిర్ణయం ఉంటుంది’ అన్నారు. ‘మీరు తెలంగాణపై చెప్పిందే చెబుతున్నారు.. నిర్ణయం ఎప్పుడుంటుందో స్పష్టం చేయగలరా? అనే ప్రశ్నకు ‘మీరు రొటీన్‌గా అడుగుతున్నారు.
ravi
నేను రొటీన్‌గానే చెబుతున్నాను. తెలంగాణ రాష్ట్రం అనేది అప్పడికప్పుడే వేసి ఇచ్చే దోశ కాదు గదా’ అని సమాధానమిచ్చారు. తెలంగాణ డిమాండ్ ఉన్నదని అంగీకరిస్తూనే.. తెలంగాణ విషయంలో ప్రతిరోజూ సంప్రదింపులు చేయలేం కదా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. గతంలో ఒకసారి తెలంగాణ అంశంపై విలేకరులతో మాట్లాడుతూ.. ‘తెలంగాణా? ఎక్కడుంది? అంటూ గతంలో పరాచికమాడి.. నాలుక కరుచుకున్న రవి.. ఇటీవలే ఆయన ఓ మహిళా విలేకరిని ఆటపట్టించబోయి అడ్డంగా దొరికిపోయారు. పీజీ కురియన్‌పై ఉన్న రేప్ కేసు విషయంలో ప్రశ్నలు సంధించిన ఓ జాతీయ మీడియా మహిళా విలేకరిని అపహాస్యం చేసి, అవమాన పరిచారు. దానిపై విమర్శలు వెల్లు క్షమాపణలు చెప్పి బయట పడ్డారు. ఇప్పుడు తెలంగాణపై మరోసారి నోరుపారేసుకున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.