తెలంగాణపై నిర్ణయం ప్రకటించండి: జవదేకర్

న్యూఢిల్లీ: ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించాలని బీజేపీ ధ్వజమెత్తింది. తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేస్తే కుదరదని, 24 గంటల్లోగా తెలంగాణపై నిర్ణయం ప్రకటించాల్సిందేనని ఆపార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని జవదేకర్ డిమాండ్ చేశారు. లేదంటే పార్లమెంట్‌లో మా తడాఖా చూపిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.