తెలంగాణపై నిర్ణయం జరిగిపోయింది: శరద్ పవార్

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం జరిగిపోయిందని, సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణం జరిగే వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఎన్సీపీ నేత శరద్‌పవార్ తెలిపిన్రు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమేనని ఆయన అన్నరు ఇవాళ ఆయన ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడిన్రు. యూపీఏ సమన్వయ కమిటీలో చర్చించి వీలైనంత త్వరగా తెలంగాణ సమస్యను పరిష్కరించాలని తాను ప్రధానికి సూచించినట్టు పవార్ స్పష్టం చేసిన్రు.అయితే, తెలంగాణ ఏర్పాటుపై ప్రభుత్వ నిర్ణయం జరిగిపోయిందని, అనుకూలమైన సమయం కోసమే ఎదురు చూస్తున్నామని ప్రధాని మన్మోహన్‌సింగ్ తనతో అన్నారని పవార్ వెల్లడించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.