తెలంగాణపై తేల్చేదాకా ఉద్యమం

 

devi-prasad– సంసద్ యాత్రకు దిగి రాకుంటే చలో అసెంబ్లీ చేపడతాం: దేవీవూపసాదరావు
-ఘనంగా రవాణాశాఖ టీ ఉద్యోగుల ఫోరం ఆవిర్భావ సభ
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేవరకూ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని తెలంగాణ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు దేవీ ప్రసాదరావు స్పష్టం చేశారు. శనివారం తెలంగాణ ఎన్టీఓ కేంద్ర కమిటీ కార్యాలయంలో రవాణాశాఖ తెలంగాణ ఉద్యోగుల ఫోరం ఆవిర్భావ సభనుద్దేశించి ఆయన మాట్లాడారు. సంసద్ యాత్రతో కేంద్రం దిగిరాకపోతే చలో అసెంబ్లీ కార్యక్షికమాన్ని చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంతోపాటు న్యాయమైన పీఆర్సీ కోసం ఉద్యమించడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఒక్క పైసా చేత్తో ఇచ్చి.. మరో చేత రూపాయి గుంజుకుంటుందని అరోపించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ నేత రవీందర్ రెడ్డి, తెలంగాణ నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, టీఎన్జీఓ నేతలు సలీముద్దీన్, రామినేని శ్రీనివాస్ రావు, ప్రతాప్, బుచ్చిడ్డి, హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు వెంక కార్యదర్శి లక్ష్మీనారాయణ, రంగాడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్, కార్యదర్శి రాంమోహన్, మెదక్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు విజయ్‌రావు, శామ్యూల్‌పాల్, ప్రభాకర్, కృష్ణ, యాదగిరిరెడ్డి, అరుణేంద్ర కుమార్, యంజులా రెడ్డి వరదరాజు, కిరణ్ పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.