తెలంగాణపై తీర్మానం చేస్తే సడక్ బంద్ విరమిస్తాం

 

kodandaram-టీ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటన

-సీఎంది సీమాంధ్ర దురహంకారం
-అసెంబ్లీలో ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధం
-సడక్ బంద్‌తో గడ్డ పౌరుషాన్ని చాటుతాం
-కాంగ్రెస్‌ను ఖతంచేసే దిశగా ఉద్యమం
-ఐదు పాయింట్లలో టీఆర్‌ఎస్ ఇన్‌చార్జుల నియామకం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఈ నెల 21న తలపెట్టిన సడక్ బంద్‌ను విరమిస్తామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను దేశ పార్లమెంటు గుర్తించాలన్న ఉద్దేశంతోనే సడక్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. శంషాబాద్ నుంచి ఆలంపూర్ వరకు నిర్వహించే సడక్ బంద్‌లో లక్షలాదిగా జనం పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సడక్ బంద్‌ను అడ్డుకోవడానికి కిరణ్ సర్కారు ఇప్పటి నుంచే కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో తెలంగాణవాదులపై అక్రమ బైండోవర్ కేసులు పెడుతూ ప్రజలను భయవూబాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా సంఘటితంగా వాటిని ఛేదించుకుని సడక్ బంద్‌ను జయవూపదం చేసి తీరుతామని కోదండరాం ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యపద్ధతిలో ఎన్నికైన సీఎం.. నియంతలా వ్యవహరిస్తున్నారని అన్నారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటూ శాసనసభ సాక్షిగా సీఎం రాజ్యాంగ విరుద్ధ వ్యాఖ్యలు చేసి మరోసారి తన సీమాంధ్ర దురహంకారాన్ని ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణాకు నిధులు ఇవ్వననడానికి ఆయనెవరు? ఆయన సర్కారే మైనార్టీలో పడిపోయింది. తుమ్మితే ఊడిపోయే ముక్కు కాంగ్రెస్ ప్రభుత్వం’ అని కోదండరాం విరుచుకుపడ్డారు. శనివారం మెదక్ జిల్లా సంగాడ్డిలో జిల్లాస్థాయి జేఏసీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మా దయాదాక్షిణ్యాలతో తెలంగాణ నాయకులకు మంత్రి పదవులు వచ్చాయని సీఎం పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు న్యాయనిర్ణేతలని, ఆ ప్రజలే నేతలను తయారు చేస్తారనే విషయాన్ని సీఎం గుర్తుంచుకుంటే మంచిదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో చట్ట ప్రకారం అధికారంలోకి వచ్చిన వారు ప్రజల కోసం పనిచేయాలని, సీఎం మాత్రం తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వనంటూ అహంకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమాల వల్లే తెలంగాణ వారికి ఉద్యోగాలు రావడం లేదంటున్న సీఎం, కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శాసనసభలో ఎందుకు తీర్మానం చేయించడం లేదని ప్రశ్నించారు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసన సభ్యులు మౌనం వహించడం సహించరానిదన్నారు.

తెలంగాణ ప్రాంత నేతలు పూర్తిగా ఆత్మాభిమానం వదిలేశారని ఈ ఘటనతో స్పష్టమైపోయిందని విమర్శించారు. ఫెవికాల్ రాసుకుని సీఎం సీటుపై కూర్చున్న కిరణ్‌కుమార్‌డ్డి అదే సీటు శాశ్వతమనుకుంటున్నారన్నారని ఎద్దేవా చేశారు. శాసనసభలో 149 మంది శాసనసభ్యులు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని, ఈ నేపథ్యంలో సర్కారు మైనార్టీలో పడిపోయినట్టు తేలిపోయిందన్నారు. ఆయనకు ఒక్క క్షణం కూడా రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలను అక్కడి రికార్డుల్లోంచి తొలగించినా తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల మనసుల్లోంచి చెరిపివేయలేరన్నారు. శాసన సభలో అవిశ్వాసంలో సీఎం గెలిచినా ప్రజా విశ్వాసం మాత్రం కోల్పోయారని విమర్శించారు. సర్కారుపై అవిశ్వాసం విషయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో ఇక న్యాయం జరగదని తేలిపోయిందని ఉద్యమించి తెలంగాణ సాధించుకుంటామన్నారు.

కాంగ్రెస్‌ను ఖతం చేసే దిశగా ఉద్యమం సాగుతుందని కోదండరాం హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఈ నెల 21న పెద్ద ఎత్తున సడక్ బంద్‌ను నిర్వహిస్తామన్నారు. సడక్ బంద్‌తో సీఎం వ్యాఖ్యలకు చెంపపెట్టులా సమాధానం చెప్పి, మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటిచెబుతామన్నారు. ఈ సమావేశంలో రాజకీయ జేఏసీ జిల్లా చైర్మన్ అశోక్‌కుమార్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, జేఏసీ నాయకులు అనంతయ్య, బీహెచ్‌ఈఎల్ ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు ఎల్లయ్య, జిల్లా మాలమహానాడు అధ్యక్షుడు సుదర్శన్ పాల్గొన్నారు.

సడక్ బంద్ కోసం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు బాధ్యతలు
ఈనెల 21న నిర్వహించనున్న సడక్ బంద్‌కు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధ్యక్షులు కే చంద్రశేఖర్‌రావు బాధ్యతలను అప్పగించారు. సడక్ బంద్‌కు రంగాడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఐదు పాయింట్లను ఎంపిక చేశారు. ఆలంపూర్ టోల్‌గేట్ పాయింట్ వద్ద టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, కావేటి సమ్మయ్య, గడ్డం అరవిందడ్డి, నల్లాల ఓదెలు ఇన్‌చార్జులుగా ఉంటూ సడక్ బంద్ విజయవంతానికి కృషి చేయనున్నారు. ఆలంపూర్, గద్వాల, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఇన్‌చార్జులు యాకూబ్, గట్టు భీముడు సహా పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున ఆలంపూర్ టోల్‌గేట్ వద్దకు చేరుకోనున్నారు.

శంషాబాద్ పాయింట్ వద్ద టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత టీ హరీష్‌రావు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌డ్డి, కొప్పుల హరీశ్వర్‌డ్డి, ఎమ్మెల్సీలు కే స్వామిగౌడ్, మహమూద్ అలీ పాల్గొంటారు. రాజేంవూదనగర్, షాద్‌నగర్, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జులు ఏ అంజయ్య, సర్దార్ పుటం పురుషోత్తంరావు సహా పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొంటారు. జడ్చర్ల పాయింట్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల తారకరామారావు, ఏనుగు రవీందర్‌డ్డి, గంప గోవర్ధన్, చెన్నమనేని రమేష్ పాల్గొంటారు. జడ్చర్ల, అచ్చంపేట, కల్వకుర్తి, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జులు డాక్టర్ సీ లకా్ష్మడ్డి, గువ్వల బాలరాజు, టీ బాలాజీ సింగ్, దేవర మల్లప్ప, ఎస్ రామకృష్ణ పాల్గొంటారు.

భూత్పూర్ పాయింట్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనారాయణ, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌డ్డి పాల్గొంటారు. దేవరకద్ర, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జులు ఏవీ రెడ్డి, సయ్యద్ ఇబ్రహీం, ఎస్ నాగరాజు, బీ శ్రీనివాస్ యాదవ్ పాల్గొంటారు. కొత్తకోట పాయింట్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, జోగు రామన్న, డాక్టర్ తాటికొండ రాజయ్య, మొలుగురి భిక్షపతి పాల్గొంటారు. వనపర్తి నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు సింగిడ్డి నిరంజన్‌డ్డి, పార్టీ నాయకులు పాల్గొంటారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.