న్యూఢిల్లీ: తెలంగాణపై డెడ్లైన్ లేదని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ గులాంనబీ ఆజాద్ అన్నారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై తుది గడువంటూ ఏమీలేదని, కచ్చితమైన సమయం ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. ఇది కేవలం పార్టీ తరపున తాను చెబుతున్న అభిప్రాయం మాత్రమేనని, రాష్ట్రంలో జరుగుతోన్న పరిణామాలపై కేంద్ర హోంశాఖ వివరిస్తుందని తెలిపారు.
ఇంకా సంప్రతింపులు జరగాల్సి ఉందని, పీసీసీ చీఫ్, సీఎం, రాష్ట్రంలోని సీనియర్ నాయకులను ఢిల్లీ పిలిపించి మాట్లాడుతామని పేర్కొన్నారు. అయితే ఈ సంప్రతింపులు ఎప్పటి వరకు జరుగుతాయో కచ్చితమైన సమయం చెప్పలేమని అన్నారు. అయితే, పీసీసీ చీఫ్, సీఎం, రాష్ట్రంలోని సీనియర్ నేతలతో వీలైనంత త్వరగా చర్చలు ఉంటాయని తెలిపారు.