తెలంగాణపై ఇటలీ భస్మాసుర హస్తం-కాలిపోతున్న తెలంగాణ ఆకాంక్ష

Baradhwajతెలంగాణపై సోనియాగాంధీ భస్మాసురహస్తంతో.. వారం వ్యవధిలో భరద్వాజ్ లాంటి తొమ్మిది మంది తెలంగాణవాదులు ఆత్మార్సపణ చేసిన్రు. వలసవాది ఇటలీబొమ్మ చేస్తున్న ఈ మారణహోమంలో తెలంగాణ ఆకాంక్ష కాలిపోతున్నది. కిరోసిన్, డీజిల్ ఒంటిపై మండుతుంటే..జై తెలంగాణ నినాదాలు చేసిన్రు. ఒళ్లంతా నిప్పులకుంపటై దహిస్తుంటే తెలంగాణ ఇవ్వండంటూ నినదించిన్రు.
జనవరి 28! తెలంగాణపై ప్రకటనకు కేంద్రం ఎట్టకేలకు.. చిట్టచివరికి తనకుతాను విధించుకున్న డెడ్‌లైన్! కానీ.. ఆ డెడ్‌లైన్ ఇప్పుడు తెలంగాణ యువత పాలిట డెత్‌లైన్‌గా మారింది! డెడ్‌లైన్ విధించుకున్న కేంద్రమే దానిని అపహాస్యం చేసి.. అలవాటు ప్రకారమే పక్కకు నెట్టేసింది! తెలంగాణపై కోటి ఆశలు పెట్టుకున్న యువతలో పెను కల్లోలం రేపింది! బతికుండి తెలంగాణ సాధించుకుందామని, స్వేచ్ఛ పొందిన తెలంగాణ గడ్డపై విజయహాసంతో శ్వాసిద్దామని ఉద్యమ శక్తులు స్ఫూర్తి నింపుతున్నా.. మీరు లేని తెలంగాణ మాకొద్దని తెలంగాణ నాయకులు మొత్తుకుంటున్నా..

Ph-8ద్రోహుల కపటనాటకాలు యువతను తీవ్ర నిర్ణయాలకు పురికొల్పుతున్నాయి! అదీ మనసు వికలమయ్యే ఘటనలతో.. కలచివేసే మరణ సన్నివేశాలతో! జనవరి 28 నుంచి వారం వ్యవధిలో 9 బలవన్మరణాలు! నవ యువకుల బలిదానాలు! బస్సుకు ఎదుళ్లి చనిపోయింది ఒకరైతే.. రైలు పట్టాలపై నెత్తురోడింది మరొకరు! ఒకరు వాటర్ ట్యాంక్ మీద నుంచి దూకి ఛిద్రమైతే.. ఇంకొకరు నిప్పుల కొలిమిలా మండిపోతూ కేంద్ర నిర్లిప్తతను నిగ్గదీశారు! వరంగల్‌లో తాజాగా మరొకరు! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యం.. కాంగ్రెస్ నేతల వైఖరితో కలతపడిన బీటెక్ విద్యార్థి నీరజ్‌భరద్వాజ్.. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 90శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ చనిపోయాడు. కేంద్రం డెడ్‌లైన్ తమ పాలిట డెత్‌లైన్‌గా మారడంతో ఆగ్రహించిన విద్యార్థులు మంత్రి సారయ్య నివాసాన్ని ముట్టడించారు. ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి భర్త వాహనంపై దాడి చేశారు. పలు వాహనాలను ధ్వంసం

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.