తెలంగాణను అడ్డుకోవాలనుకోవడం సిగ్గుచేటు-కేటీఆర్

సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, లోక్‌సత్తా పార్టీ అధినేత జయవూపకాశ్ నారాయణ్‌లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని సీమాంవూధులకు పిలుపునివ్వడం సిగ్గుచేటని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సంస్కారమంతులనుకునే సీమాంధ్ర నేతలంతా తెలంగాణ విషయంలో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణను ఎవ్వరూ అడ్డుకోలేరని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తీరుతుందని చెప్పారు. లగడపాటి రాజకీయ సన్యాసం తీసుకుని చిలక జోస్యం చెప్పుకుంటూ బతకాల్సిందేనని ఎద్దేవ చేశారు. తెలంగాణ ఐకేపీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘తెలంగాణ పునర్ నిర్మాణంలో ఐకేపీ ఉద్యోగుల పాత్ర-గ్యులరైజషన్ సాధన’ అంశంపై సదస్సును నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిధిగా కేటీఆర్ హాజరై మాట్లాడారు. జాతీయ నాయకత్వాన్ని చూసి ఓట్లు పడే రోజులు పోయి ప్రాంతీయ నాయకత్వానికే మద్దతు తెలిపే తరుణం ఆసన్నమైందన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణకు మరింత అనుకూలమని చెప్పారు. జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు మద్దతు ఇస్తున్నా కాంగ్రెస్ తెలంగాణ విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందనే వాదనలను కొట్టి పారేశారు. కేసీఆర్ హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు కేబినెట్‌లో ఆమోదం పొందగానే సీఎం కిరణ్ తెలంగాణ రాష్ట్ర ప్రభావం దేశంపై పడుతుందని అనడం దారుణమని మండిపడ్డారు. అసెంబ్లీకి బిల్లు వచ్చాక ఈ ప్రభావం ప్రపంచంపై ఆ తర్వాత అంగారకుడిపై పడుతుందని సీఎం అన్నా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు.
ktr
టీఎన్జీవో అధ్యక్షుడు దేవీవూపసాద్ మాట్లాడుతూ అన్యాయం చేసే ఏ అంశాన్నైనా వ్యతిరేకిస్తామని, స్థానికత ఆధారంగా విభజన జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు దక్కలేదని, కుట్రలు చేసి ఇక్కడి ఉద్యోగాలను సీమాంవూధులు కొల్లగొట్టారని చెప్పారు. వాటిని రక్షించుకునేందుకే వారు నేడు ఉద్యమాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు దక్కాల్సిన 42శాతం ఉద్యోగాల్లో 20శాతం సీమాంవూధులే ఉన్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడితే రెండు లక్షలమంది రోడ్డున పడతారని సీఎం కిరణ్ అంటున్నారని, వారంతా అక్రమంగా తెలంగాణలో ప్రవేశించిన సీమాంధ్ర ఉద్యోగులని చెప్పారు. సంఘం అధ్యక్షుడు కే గంగాధర్ అధ్యక్షత జరిగిన ఈ సదస్సులో పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రవీందర్‌డ్డి, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు బాల్కసుమన్, టీజేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఎస్‌ఎల్ పద్మ, తెలంగాణ ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గంగాడ్డి, కార్యదర్శి సుదర్శన్, సంఘం నాయకులు సరస్వతి, సుదర్శన్, వెంకట్, జే ప్రవీణ్, సురేష్‌డ్డి, చంద్ర, దాసు, రాజ్‌వీర్, రాజాడ్డి, రమణమ్మ, నాగేశ్, రామస్వామి పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.