తెలంగాణకోసం అందరినీ కదిలిస్తాం -జేఏసీ

tg
– ఉద్యమం మునుముందుకే.. ఆగేది లేదు.. సాగి తీరుతాం
– జేఏసీ ప్రోగ్రామ్స్ కమిటీ నిర్ణయం.. ఉద్యమ కార్యాచరణకు పిలుపు
– ఎల్లుండి నుంచే సన్నాహాలు షురూ
– 16న శాసనసభ నియోజకవర్గాలలో
ప్రచారయావూతలు, నిరసనర్యాలీలు
– 17న ప్రతీ గ్రామంలో నల్లజెండాల ప్రదర్శన
– 24, మార్చి 2న రహదారుల బంద్
– ఆగేది లేదు.. సాగి తీరుతాం
– తెలంగాణకోసం అందరినీ కదిలిస్తాం
– జేఏసీ ప్రోగ్రామ్స్ కమిటీ భేటీ
– ఉద్యమ కార్యాచరణకు పిలుపు
– ఎల్లుండి నుంచే సన్నాహాలు షురూ
– 16న ప్రచారయావూతలు, నిరసనర్యాలీలు
– 17న ప్రతి గ్రామంలో నల్లజెండాల ప్రదర్శన
– 24, మార్చి 2న రహదారుల బంద్
తెలంగాణపై కేంద్రం మెడలు వంచే విధంగా జేఏసీ ఉద్యమ కార్యాచరణ రూపొందిందని, ఇకనుంచి కాంగ్రెస్ మంత్రులను, శాసనసభ్యులను, ఎంపీలను రాజకీయంగా, సాంఘికంగా బహిష్కరించేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని జేఏసీ కో కన్వీనర్ వీ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. తెలంగాణను అనిశ్చిత స్థితిలోకి నెట్టిన కాంగ్రెస్ నాయకత్వంపైననే జేఏసీ ఉద్యమ కార్యాచరణను కేంద్రీకృతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకోసం అసహనానికి గురై, ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువకిశోరాల ఆత్మబలిదానాలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కుర్చీలను అంటిపెట్టుకున్న మంత్రులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మంగళవారం జేఏసీ ప్రోగ్రామ్స్ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో సిద్ధం చేసిన ఉద్యమ కార్యాచరణ వివరాలను శ్రీనివాస్‌గౌడ్ విలేకరులకు తెలిపారు. జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఉద్యోగ సంఘాల కో చైర్మన్ విఠల్, రసమయి బాలకిషన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణకోసం ఆత్మార్పణ చేసి అమరులైన వీరుల అంతిమయాత్ర కూడా జరుపలేని నిర్బంధకాండ తెలంగాణలో కొనసాగుతున్నదని జేఏసీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ యువకుల ఆత్మబలిదానాలకు కారకులైన కేంద్ర రాష్ట్ర నాయకత్వంపై ఐపీసీ 306 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేయాలని జేఏసీ ప్రోగ్రామ్స్ కమిటీ డిమాండ్ చేసింది. జేఏసీ ఇచ్చిన సడక్‌బంద్ (రహదారుల దిగ్బంధం)లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ఉద్యమ కార్యాచరణను జేఏసీ ప్రోగ్రామ్స్ కమిటీ సిద్ధం చేసింది. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 14, 15 తేదీలలో తెలంగాణ పది జిల్లాలలో జేఏసీ సమావేశాలను నిర్వహిస్తామని చెప్పారు. 16న తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీల నియోజకవర్గ కేంద్రాలలో ర్యాలీలు నిర్వహిస్తామని, మంత్రులను రాజకీయంగా, సాంఘికంగా బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిస్తామన్నారు. తెలంగాణ మంత్రులు పదవులను వదిలి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేస్తామని, కరపవూతాలు పంపిణీ చేస్తామని తెలిపారు. 17న గ్రామ కేంద్రాలలో, మండల కేంద్రాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు.

18న బైక్ ర్యాలీలు చేపడతామని, 19న శాసనసభ్యులకు నిరసన పోస్టుకార్డులు రాస్తామని, 20న శాసనసభ్యుల దిష్టిబొమ్మలను దహనం చేస్తామని, 21న అమరవీరులకు నివాళులర్పిస్తూ పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తామని, అదే రోజున ప్రతిజ్ఞ కార్యక్షికమం ఉంటుందని తెలిపారు. విఠల్ మాట్లాడుతూ తెలంగాణపై రోజుకో ప్రకటన చేస్తూ తెలంగాణ ప్రజలను గందరగోళపరుస్తూ ఆత్మహత్యలకు కారకులైన కేంద్ర ప్రభుత్వంలోని నేతలపైన, రాష్ట్ర మంత్రులపైన ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం కేసు నమోదు చేయాలని అన్నారు. ప్రోగ్సామ్స్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, కో చైర్మన్ రఘు, అడ్వకేట్స్ జేఏసీ నేత రాజేందర్‌డ్డి, అద్దంకి దయాకర్, వెంకటడ్డి కలిసి ఉద్యమ కార్యాచరణను ఖరారు చేశామని చెప్పారు. వరంగల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన భరద్వాజ్ అంతిమయావూతను కూడా నిర్వహించకుండా పోలీసులు పాశవికంగా లాఠీచార్జి చేశారని, పోలీసుల కిరాతకాన్ని ఆయన ఖండించారు. ఆ ఘటనలో టీఆర్‌ఎస్ శాసనసభ్యులు హరీశ్‌రావు తీవ్రంగా గాయపడ్డారన్నారు. అద్దంకి దయార్ మాట్లాడుతూ 24న ఏడో నంబర్ జాతీయ రహదారిపైన స్టేషన్ తిమ్మాపురం, కొత్తూరు, షాద్‌నగర్, బాలానగర్, జడ్చర్ల, భూత్పూర్, పెబ్బేరు చౌరస్తాలలో నిరసనోద్యమాలు వెల్లు హెచ్చరించారు. మార్చి 2న జాతీయ రహదారి 9లో హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, బాటసింగారం, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, మాధవరం, మునగాల, కోదాడ కేంద్రాలలో రహదారులను దిగ్బంధిస్తామని తెలిపారు.

ఇదీ ఉద్యమ కార్యాచరణ..
– ఈ నెల 8న జడ్చర్లలో సడక్‌బంద్ స్టీరింగ్‌కమిటీ సమావేశం
– 11, 12 తేదీలలో బస్సుయావూతలు
– 13, 15 తేదీలలో జిల్లా జేఏసీ సమావేశాలు
– 16న శాసనసభ్యులు ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రాలలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్ల ఏర్పాటు, నిరసన ర్యాలీలు
– 17న ప్రతీ గ్రామంలో, మండల కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు
– 18న బైక్ ర్యాలీలు
– 19న శాసనసభ్యులకు నిరసన పోస్టుకార్డులు
– 20న శాసనసభ్యుల దిష్టిబొమ్మల దహనం
– 21న అమరవీరులకు నివాళులు, ప్రతిజ్ఞ
– 24న జాతీయ రహదారి 7పై సడక్‌బంద్. స్టేషన్ తిమ్మాపురం, కొత్తూరు, షాద్‌నగర్, బాలానగర్, జడ్చర్ల, భూత్పూర్, అడ్డాకుల, పెబ్బేరు, ఎర్రబెల్లి చౌరస్తా, అలంపూర్ చౌరస్తా తదితర కూడళ్లలో నిరసనోద్యమాలు.
– మార్చి 2న ఎన్‌హెచ్ 9 విజయవాడ రహదారిపై సడక్‌బంద్. హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, బాటసింగారం చౌరస్తా, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, మాధవరం, మునగాల, కోదాడ కేంద్రాలలో నిరసనోద్యమాలు

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.