తెలంగాణకు శాపంగా మారిన ఆజాద్, షబ్బీర్ అలీ

ఎంఐఎంకు తొత్తుగా మారిన ఆజాద్, మక్బూల్ అనే ఉగ్రవాదిని విడిపించిన షబ్బీర్ అలీ తెలంగాణ పాలిట శాపంగా మారిన్రు. తెలంగాణ విభజనకు ఈ దుర్మార్గులు అడ్డుపడుతున్నరు. రాష్ట్రాన్ని విడదీస్తే రాయల తెలంగాణ కావాలని కోరిన ఏకైక పార్టీ మజ్లిస్ ను అనుసరిస్తున్నరు. వీళ్ల స్వార్థం కోసం రాయలసీమలోని రెండు జిల్లాలను తెలంగాణతో కలిపి తెలంగాణ ప్రజల గుండెలపై కుంపటి పెడ్తున్నరు. రాయల తెలంగాణను చిదంబరం, షిండే వ్యతిరేకించినప్పటికీ సోనియా సలహాదారు అహ్మద్ పటేల్ ను మేనేజ్ చేసి రాయల తెలంగాణ ఏర్పాటుకు రంగం సిద్ధంచేస్తున్నరు. ఆజాద్ కుట్రల వల్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంచ నెరవేరకుండా పోతున్నది. షబ్బీర్ అలీ తెలంగాణకు చేస్తున్న ద్రోహంపై తెలంగాణవాదులు మండిపడుతున్నరు. అయితే డిప్యూటీ సీఎం సహా తెలంగాణ మంత్రులంతా రాయల తెలంగాణపై ఇంతవరకు స్పందించకపోవడంపై ప్రజలు ఫైర్ అవుతున్నరు.

This entry was posted in CRIME NEWS.

Comments are closed.