తెలంగాణకు బ్రిజేష్ రిక్తహస్తం

ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో ప్రచురించకుండా ఆపాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పాటవుతున్న తరుణంలో అత్యంత కీలకమైన జలవనరులపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడితే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయని కొంతకాలంగా నీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పేరు లేకుండా ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం పేరుతో తీర్పును గెజిట్ రూపంలో ప్రకటిస్తే భవిష్యత్తులో అంతర్‌రాష్ట్ర జలవివాదాలు తలెత్తే ప్రమాదముందనే వాదన తెరముందుకు వచ్చింది. అదే అనుమానం ట్రిబ్యునల్ తీర్పులో నిజమైంది. కృష్ణాబేసిన్‌లో లేని తెలుగుగంగకు 25టీఎంసీలను కేటాయించిన దానిపై వివాదం నడుస్తుండగా ట్రిబ్యునల్ తాజాగా రాజోలిబండ కుడికాలువ కింద ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ల కోసం మరో4టీఎంసీలు కేటాయించడంపై తెలంగాణ ప్రాంత నీటిపారుదలరంగ నిపుణులు, నాయకులు భగ్గుమంటున్నారు. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు తెలంగాణ ప్రాంత నిపుణులు.

అసలు వివాదమెక్కడ.. అన్యాయం చేసిందెవరు?
వాస్తవానికి బచావత్ కమిషన్ కృష్ణా నదీజలాలను కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రవూపదేశ్‌కు నీటివాటాలను పంచిన తర్వాత మిగులు జలాల పంపకం, వాడకంపై వివాదాలు రగులుతూనే ఉన్నాయి. 1956 సెంట్రల్‌వాటర్ కమిషన్ యాక్ట్ ప్రకారం ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ మొత్తం కృష్ణా నదిలోని 2,173 టీఎంసీ(థౌసెండ్ మిలియన్ క్యూబిక్ అడుగులు)ల నికరజలాలను మూడు రాష్ట్రాలకు పంచింది. ఆయా రాష్ట్రాల పరీవాహక ప్రాంతాలు, పరిస్థితులను అధ్యయనం చేసి నికరజలాల వాటాను నిర్ణయించింది. దీని ప్రకారం1976లో కర్ణాటకకు 734 టీఎంసీలు, మహారాష్ట్రకు 585, ఆంధ్రవూపదేశ్‌కు 811 టీఎంసీల నీటిని కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగిసిన క్రమంలో 2004లో ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేవలం మిగులు, వరద జలాల పంపకాలపైనే దృష్టి సారించింది. కృష్ణానదిలో మొత్తం 285 టీఎంసీల వరద లేదా మిగులు జలాలున్నాయని గుర్తించిన ట్రిబ్యునల్ మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది. ఆంధ్రవూపదేశ్‌కు 145టీఎంసీలు, కర్ణాటకకు 105, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించింది.

అధికజలాల్లో సరాసరి ప్రవాహం కింద ఆంధ్రవూపదేశ్‌కు అధనంగా 45 టీఎంసీలు దక్కాయి. ఇందులో 30టీఎంసీల నీటిని అత్యవసర వాడకానికి నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌ల్లో రిజర్వ్ ఉంచాలని బ్రిజేశ్ ట్రిబ్యునల్ సూచించింది. మిగిలిన 15 టీఎంసీలను జూరాలకు కేటాయించగా 6 టీఎంసీలను పర్యావరణ పరిరక్షణకు నిలువ ఉంచాలని పేర్కొంది. కానీ 145 టీఎంసీల కేటాయింపు విషయంలోనే ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదం నెలకొంది. 145 టీఎంసీల్లో 120లను నాగార్జునసాగర్‌లో రిజర్వ్‌లో ఉంచాలని సూచించగా మిగిలిన 25 టీఎంసీలను తెలుగుగంగకు కేటాయించారు. అసలు నదీ పరీవాహక ప్రాంతమేలేని తెలుగుగంగకు నీటిని కేటాయించడమే తప్పని తెలంగాణ నీటిరంగ నిపుణులు వాదించారు. నదిపరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆ లెక్కన నల్లగొండలోని ఎస్‌ఎల్‌బిసి, కల్వకుర్తి మహాత్మాగాంధీ, నెట్టెంపాడు జవహార్ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లను తరలించాలని డిమాండ్ చేశారు. కానీ ఆ కోణంలో ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదించలేదు. కృష్ణా బేసిన్‌లో లేని రాయలసీమ, ఆంధ్రవూపాంతంపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది.

తాజాగా రాజోలిబండ కుడికాలువకింద ప్రాజెక్ట్‌లకు నాలుగు టీఎంసీలను కేటాయించడం వల్ల మహబూబ్‌నగర్‌కు తీరని అన్యాయం జరిగే పరిస్థితి నెలకొంది. రాయచూరు, కర్నూలు సరిహద్దులో తుంగభవూదపై ఉన్న రాజోలిబండ నుంచి మహబూబ్‌నగర్‌కు ఎడమ కాలువ నుంచి 15.78 టీఎంసీలు రావాల్సి ఉండగా కేవలం ప్రస్తుతం ఐదు టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. ఫలితంగా లక్ష ఎకరాలకు బదులుగా కేవలం 40వేల ఎకరాలు మాత్రమే సాగవుతున్నది. రాయలసీమ నాయకులు ప్రతి ఏటా 29 టీఎంసీల నీటిని కేసీ కెనాల్ ద్వారా తరలించుకుపోవడం వల్ల పాలమూరు భూములు బీడువారే పరిస్థితి నెలకొంది. మొదటినుంచి తాము తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నప్పటికీ సీమాంవూధుల ఏలుబడిలోని సర్కార్ పెడచెవిన పెట్టిందని తెలంగాణ జలరంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తుపెంపుతోపాటు నీటివాటాపై సవరణలు కోరు తూ సుప్రీంను ఆశ్రయించడంతో తుది తీర్పును వెలువరించినా డిసెంబర్ వరకు గెజిట్ పబ్లికేషన్ చేయవద్దని స్టే ఇచ్చింది. తుది తీర్పు నేపథ్యంలో స్టేను ఎత్తివేయించడానికి పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించే అవకాశం ఉంది..

బ్రిజేశ్ గెజిట్‌ను ఆపాల్సిందే
సీమాంవూధుల ఏలుబడిలోని సర్కార్ వివక్ష వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ నీటి రంగ నిపుణులు అంటున్నారు. కృష్ణా బేసిన్‌లో ఉన్న తెలంగాణ కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్ట్‌లకు ఒక్క టీఎంసీని కూడా కేటాయించకపోవడం దారుణమని పేర్కొన్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువడినా దానిని గెజిట్‌లో ప్రచురించకుండా ఆపాలని, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌డ్డి, తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ నాయకులు దేశ్‌పాండే, వెంక విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాతే గెజిట్ నోటిఫికేషన్ రావాలని ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఇప్పటికే కొత్త రాష్ట్రం ఏర్పాటుయూపీఏ ప్రభుత్వం ప్రకటించినందున ఈ గెజిట్‌ను ఆపాలని పేర్కొన్నారు. కృష్ణానదిపై అతిపొడవైన పరివాహకవూపాంతం ఉన్న తెలంగాణను ట్రిబ్యునల్ ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోకుండా ఆంధ్రవూపదేశ్ కింద కలిపేస్తే అనర్థాలుంటాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.