తెలంగాణకు టీఆర్‌ఎస్ రక్షణ కవచం: కేటీఆర్

నిజామాబాద్: టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాంటిదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు గులాబీ జెండాను రెపరెపలాడించాలని విజ్ఞప్తి చేశారు. ప్యాకేజీలు ఇస్తామంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరని, ప్యాకేజీలకు సిద్ధంగా లేమని అన్నారు. ప్యాకేజీల మాట ఎత్తితే కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.