తెలంగాణకు కాంగ్రెస్సే అడ్డు

vital
– సంసద్ యాత్రను విజయవంతం చేద్దాం
– బయ్యారం ఉక్కును తెలంగాణ దాటనివ్వం
– తెలంగాణ ఉద్యోగుల సంఘం విస్తృత స్థాయి సమావేశంలో అధ్యక్షుడు విఠల్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే అడ్డుగా నిలిచిందని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ ఉద్యోగుల కేంద్ర సంఘ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులను చేయాలని ఉద్యోగులకు పిలుపు నిచ్చారు. ప్రజల పక్షాన ఉండని తెలంగాణ ప్రజావూపతినిధులు, మంత్రులు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ ఆకాంక్షను చాటడానికి ఈ నెల 28, 29 తేదీల్లో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘సంసద్ యాత్ర’ను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రస్తుతం చేపడుతున్న బదిలీల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థల్లో, యూనివర్సిటీల్లో 610 జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, వనరులు, దోచుకెళ్లిన సీమాంధ్ర పాలకుల కన్ను బయ్యారం గనులపై పడిందన్నారు. బయ్యారం ఇనుప గనుల నుంచి ఒక్క మట్టి పెళ్ళను సైతం తెలంగాణ సరిహద్దులు దాటనివ్వబోమని స్పష్టంచేశారు. బయ్యారంలోనే స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

బయ్యారం గనుల తరలింపును అడుడకుంటామంటే సీమాంవూధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయన్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక తెలంగాణ ఉద్యమంపై విషం కక్కుతోందన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో బయ్యారంలోనే ఫ్యాక్టరీ నిర్మించి తెలంగాణ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, జలమండలిలో జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ కామ్‌గార్ యూనియన్‌ను అత్యధిక మేజారిటీతో గెలిపించి తెలంగాణ వాదాన్ని చాటి చెప్పాలి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ తక్షణమే ఆరోగ్య కార్డులు విడుదల చేయాలి, 610 జీవో అమలు చేయాలి, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటూ ఐదు తీర్మానాలను ఏకక్షిగీవంగా ఆమోదించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.