తెలంగాణకు అడ్డుపడింది చంద్రబాబే: అద్వానీ

ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ఇచ్చేవాళ్లమని.. టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డు పడకుంటే అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఉండేదని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. ఆయన బేగంపేట విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర నేతలతో సుమారు గంట సేపు మాట్లాడారు. తెలంగాణ జేఏసీ ఢిల్లీలో సంసద్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిసిందని.. తెలంగాణ ఇవ్వడానికి రాజకీయ సంకల్పం కావాలని అద్వానీ వారితో పేర్కొన్నారు. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ, విదర్భ రాష్ట్రాలు ఏర్పాటు కావాల్సిందని… తెలంగాణకు చంద్రబాబు, విదర్భకు శివసేన అడ్డు పడ్డాయని వివరించారు. ములాయం, లాలూ లాంటి వాళ్లు నిరాకరించినా, మూడు కొత్త రాష్ట్రాలు ఇచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే గెలుస్తుందని, తప్పనిసరిగా తెలంగాణ ఇస్తుందని అద్వానీ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని ఈసారి తమ ఎన్నికల ఎజెండాలో పెట్టనున్నట్లు చెప్పారు

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.