తెలంగాణకు అడ్డం ఆగులాం!

azad2– ఇబ్బంది పెట్టిన షిండే గడువు ప్రకటన!
– ఆజాద్ ప్రకటన సృష్టించిన కల్లోలంపై
కాంగ్రెస్ కోర్‌కమిటీలో విస్తృత చర్చ
– తెలంగాణ ఏర్పాటా? సమైక్య రాష్ట్రమా?
ఏది ప్రకటించాలి? ఎప్పుడు ప్రకటించాలి?
– నిర్ణయం లేకుండానే ముగిసిన భేటీ
– కోర్‌కమిటీకి ఉపాధ్యక్షుడు రాహుల్ హాజరు!
– నేడు మరింత లోతైన చర్చకు అవకాశం
భావోద్వేగాలు తీవ్రంగా ఉన్నాయి.. ప్రకటన ఇప్పుడొద్దన్న ఆజాద్?
మరింత సమయం తీసుకోవాలని సూచన.. అదే మంచిదన్న పటేల్
గడువులోపే తేల్చేద్దామని షిండే, చిదంబరం పట్టు!
కాంగ్రెస్ కోర్ కమిటీలో భిన్నాభిప్రాయాలు
నిర్ణయం లేకుండానే సమావేశం నేటికి వాయిదా

తెలంగాణ ప్రకటన వాయిదా పడేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ కీలక సూత్రధారిగా పని చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 28న తెలంగాణపై ప్రకటన రావటం లేదని తేల్చేసిన ఆజాద్.. గురువారం జరిగిన కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశంలోనూ తెలంగాణకు అడ్డంపడ్డారని విశ్వసనీయంగా తెలిసింది. సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా నిర్ణయం వాయిదాకే మద్దతు పలికారని సమాచారం. అయితే హోం మంత్రి షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు వాయలార్ రవి మాత్రం గడువులోగానే తెలంగాణపై తేల్చాలని పట్టుబట్టినట్లు సమాచారం. తెలంగాణపై ప్రకటన చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారుతుందని ఆజాద్ పేర్కొనగా.. షిండే దానిని తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. కోర్‌కమిటీలో ముఖ్య నేతల మధ్య మొట్టమొదటిసారిగా తీవ్ర భిన్నాభివూపాయాలు వ్యక్తంకావడంతో 28లోపు చేయాల్సిన ప్రకటనపై ఏ నిర్ణయానికీ రాకుండానే సమావేశం శుక్రవారానికి వాయిదా పడిందని తెలుస్తోంది.

హోం మంత్రి షిండే తెలంగాణపై తుది నిర్ణయానికి అఖిలపక్ష సమావేశంలో చెప్పిన గడువు ఈ నెల 28. ఈలోపు కేంద్రం ప్రకటన చేయాల్సి ఉంది. అఖిలపక్షం తర్వాత పలు సందర్భాల్లో షిండే సహా పలువురు కేంద్ర నాయకులు సైతం గడువులోగా ప్రకటన వస్తుందని ఉద్ఘాటిస్తూవచ్చారు. అయితే.. బుధవారం ఏఐసీసీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడిన ఆజాద్.. నెల అంటే కచ్చితంగా 30 రోజులు కాదని, తెలంగాణకు డెడ్‌లైన్ అంటూ ఏమీ లేదని చెప్పారు. ఇంకా చర్చలు జరపాల్సి ఉందని అన్నారు. ఈ ప్రకటనతో తెలంగాణపై కేంద్రం నిర్ణయం ఆలస్యం కావడం, లేదా మరింత నాన్చడం జరుగుతున్నదన్న సంకేతాలు బయటికి వచ్చాయి. దీనిపై తెలంగాణ ఆగ్రహంతో రగిలిపోయింది. ఈ నేపథ్యంలో ంగ్రెస్ కోర్‌కమిటీ గురువారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో భేటీ జరిపింది. ఆజాద్ ప్రకటనకు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతిస్పందనలను కోర్‌కమిటీ అంచనా వేసింది. మధ్యాహ్నం నాలుగు గంటలకు మొదలైన కోర్ కమిటీ సమావేశం దాదాపు 40నిమిషాలు

000155A…మిగతా 6వ పేజీలోకొనసాగింది. ఈ సమావేశానికి పార్టీ కొత్త ఉపాధ్యక్షుడిగా బుధవారమే బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీతో పాటు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, హోం మంత్రి షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం, రాష్ట్ర ఇన్‌చార్జులు ఆజాద్, వాయిలార్ రవి, మాజీ ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, తెలంగాణపై నిర్ణయం ఇప్పటికిప్పుడు ప్రకటిస్తే.. ఇవి మరింత పెచ్చరిల్లి.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదమున్నదని ఆజాద్ వాదించినట్లు తెలుస్తోంది. నిర్ణయాన్ని నాన్చుతూ వచ్చే ఎన్నికల నాటికి ప్రకటన చేస్తే సరిపోతుందని ఆయన అభివూపాయపడినట్లు విశ్వసనీయవర్గాలు పేర్కొన్నాయి. అయితే.. దీనికి అభ్యంతర తెలిపిన చిదంబరం, షిండే, వాయలార్ రవి.. గడువులోగానే తేల్చేయాలని గట్టిగా వాదించారని సమాచారం.

చర్చకు అంశాలు రెండే!: హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఇవ్వడం, సీమాంవూధకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం లేదంటే రాష్ట్ర విభజన జరుగదని ప్రకటించి, తెలంగాణకు ప్రత్యేకంగా ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయడం. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఈ రెండు అంశాలపైనే కోర్‌కమిటీ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ రెండు నిర్ణయాల్లో దేనిని ప్రకటించాలన్నదానిపైనే సందిగ్ధత కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంతదాకా వచ్చిన తర్వాత హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరే ప్రత్యామ్నాయాన్నీ తెలంగాణవాదులు అంగీకరించే అవకాశం లేదని రవి, దిగ్విజయ్ చెప్పినట్లు తెలిసింది. ప్రత్యేక ప్యాకేజీగానీ, గూర్ఖాలాండ్ తరహాలో ప్రత్యేక మండలి కానీ తెలంగాణ విషయంలో పని చేయవని వారు అభివూపాయపడినట్లు సమాచారం. చండీగఢ్ తరహాలో హైదరాబాద్‌ను ఉంచడానికి ఉమ్మడి రాజధానిగా అవకాశాల్లేవని, చండీగఢ్ మాదిరిగా ఇది సరిహద్దులో లేదని నేతలు భావించారని తెలిసింది. అదే సమయంలో తెలంగాణ ఇస్తే పార్టీకి వచ్చే ఎంపీ సీట్లెన్ని? ఇవ్వకపోతే నష్టపోయేది ఎంత? అనే అంశాలు చర్చకు వచ్చినట్లు ఏఐసీసీలోని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీని భావి ప్రధానిగా చూడాలని ఆశపడుతున్న సోనియా.. ఈ క్రమంలోనే నిర్ణయంపై సోనియా ఆచితూచి వ్యవహరిస్తున్నారని టెన్‌జన్‌పథ్ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ అంశంలో రాహుల్‌ను భాగస్వామిని చేయాలనే అభివూపాయాన్ని కోర్‌కమిటీ సభ్యులు కొందరు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

s10షిండేది తొందరపాటు ప్రకటన!: తెలంగాణ విషయంలో నాన్చుతూ వచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం.. అఖిలపక్షంలో షిండే గడువు చెప్పడంతో ఆనాడే కొంత ఇబ్బందికి గురైనట్లు తెలుస్తోంది. షిండే తొందరపటి ఆనాడు గడువు విధించడంతోనే ప్రస్తుతం పరిస్థితి పీకలమీదకు వచ్చిందన్న అభివూపాయాన్ని పలువురు కోర్‌కమిటీ సభ్యులు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తొందరపాటును సరిదిద్దుకోవడం ఎలా అన్న దిశగా చర్చలు నడిచినట్లు చెబుతున్నారు.

తాను పెట్టిన గడువును అపహాస్యం చేసేలా అజాద్ ప్రకటన చేయడంపై షిండే ఈ సమావేశంలో నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. తెలంగాణ ప్రకటన వాయిదా పడే అవకాశం ఉందని ఆజాద్ చెప్పడానికి ముందే అధిష్ఠానం అదే అవగాహనతో ఉన్నదని, కానీ.. ఆజాద్ ప్రకటన చేసిన సమయం సందర్భం తగిన విధంగా లేదన్న అభివూపాయం వ్యక్తమైందని అంటున్నారు. దీనిపై కోర్‌కమిటీలో వివరణ ఇచ్చిన ఆజాద్.. మీడియా వెంటపడటంతోనే తాను ఆ ప్రకటన చేయాల్సి వచ్చిందని తెలిపినట్లు సమాచారం. తన ప్రకటనపై ఉభయ ప్రాంతాల నేతల స్పందనలను కోర్‌కమిటీ దృష్టికి ఆజాద్ తీసుకువచ్చినట్లు తెలిసింది. మొత్తానికి ప్రకటన చేసే విషయంలో ఎటూ తేల్చుకోలేక పోయిన నేతలు.. సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు.
తెలంగాణ రికార్డు: ఎక్కువసార్లు చర్చ జరిగి కూడా కాంగ్రేస్ కోర్‌కమిటీ లో నిర్ణయం తీసుకోని అంశంగా తెలంగాణ’ నిలిచింది. గత మూడు సంవత్సరాలనుండి చర్చలు జరుపుతూ కూడా తెలంగాణ పై నిర్ణయం తీసుకోలేకపోవడం వెనుక సోనియా సమస్యను అత్యంత సున్నితంగా పరిగణించడమే కారణమంటున్నారు. దీని వెనుక సీమాంధ్ర లాబీయింగ్ బలమైన ప్రభావం చూపుతున్నదని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.