తెలంగాణకు అడ్డంకులు తొలగించేందుకు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్

తెలంగాణ ప్రక్రియపై అభ్యంతరాలు తెలుపుతూ ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళితే అడ్డుకునేందుకు అత్యున్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలైంది. తెలంగాణకు చెందిన న్యాయవాది అరుణ్‌కుమార్ పొలిశెట్టి శుక్రవారం ఈ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కల సాకారమవుతున్న ప్రస్తుత తరుణంలో దానిని అడ్డుకునేందుకు ఉన్నత న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసి ఆటంకాలు కల్పించేందుకు సీమాంవూధులు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఈ కుట్రలను భగ్నం చేసేందుకే తాను కేవియట్ పిటిషన్ వేశానని తెలిపారు.

తెలంగాణ ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు 371 (డి) ఆర్టికల్, హైద్రాబాద్, సీడబ్ల్యూసీ నిర్ణయం వంటివాటిపై ఎవరైనా అభ్యంతరాలతో సుప్రీంను ఆశ్రయిస్తే కేవియట్ పిటిషన్ ప్రకారం వాదనలు తెలిపేందుకు తనకు అనుమతి లభిస్తుందని వివరించారు. పిటిషన్‌లో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు, ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎన్టీవీ చైర్మన్ నరేంవూదనాద్ చౌదరి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చైర్మన్ వేమూరి రాధాకృష్ణను ప్రతివాదులుగా చేర్చారు

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.