తెగబడ్డ ఉగ్రవాదులు-దిల్‌సుఖ్‌నగర్‌లో వరుస బాంబు పేలుళ్లు బీభత్సం

bobblst-శక్తిమంతమైన రెండు పేలుళ్లకు 25 మంది దుర్మరణం!
-11 మందే చనిపోయారన్న సీఎం, డీజీపీ
-80 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
– రాత్రి 7.01 గంటలకు కోణార్క్ థియేటర్ వద్ద తొలి పేలుడు
– సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత వెంకటాద్రి వద్ద మరో విస్ఫోటం
– పేలుళ్లకు ఆర్డీఎక్స్? టైమర్ అమర్చి.. అనుకున్న సమయానికి పేల్చి..
– ఛిద్రమైపోయిన శరీరాలు.. మృతదేహాల్లో ఇనుప ముక్కలు
– కసబ్, అఫ్జల్‌గురు ఉరికి ప్రతీకారంగానేనా?
– హైదరాబాద్ చేరుకున్న ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ

దేశ వ్యాప్తంగా హై అలర్ట్
హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశమంతటా హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో జనసమ్మర్థం అత్య ధికంగా ఉండే ఇండియా గేట్, రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. అలాగే ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, సూరత్, కాన్పూర్ తదితర నగరాల్లో పోలీసులను అప్రమత్తం చేశారు. విస్తృతంగా తనిఖీలు మొదలుపెట్టారు.

Dilshuknagar-bobblastజనం రద్దీ హోరులో.. అకస్మాత్తుగా రెండు భారీ పేలుళ్లు.. నిప్పులు చిమ్ముకుంటూ.. దట్టమైన పొగ..! ఏం జరిగిందో చూసేలోపు.. చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు! కొన్ని మాంసపు ముద్దలై.. మరికొన్ని నెత్తుటి మడుగులో ఒరిగిపోయి..! కాళ్లు చేతులు తెగిపడినవారి హాహాకారాలు.. రోదనలు వేదనలు.. భయంతో పరుగులు తీసిన జనం!

ఇది హైదరాబాద్‌లో.. నిత్యం రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాదం సృష్టించిన బీభత్సం! చూపరులకు ఒళ్లు జలదరించే భీతావహ దృశ్యం! హైదరాబాద్ గుండెకు మరో గాయం! మక్కా మసీదు పేలుడు శబ్దాలు చెవుల్లో రింగుమంటుండగానే.. లుంబినీపార్క్-గోకుల్ చాట్ వద్ద జంటపేలుళ్ల పీడకలలు వెంటాడుతుండగానే.. జనం భద్రతపై భరోసాలేని రాజధానిపై ముష్కరులు చేసిన మరో నెత్తుటి సంతకం! కసబ్.. అఫ్జల్ గురు ఉరిశిక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి హెచ్చరికలు చేసినప్పటికీ.. ఘోరం జరిగిపోయింది! నగరం చిగురుటాకులా వణికిపోయింది! ఉన్మాద రక్కసి వికటాట్టహాసానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం 11 మంది అత్యంత భయానక పరిస్థితుల మధ్య ప్రాణాలొదిలేశారు.. అనధికారికంగా ఆ సంఖ్య 25కుపైనే ఉంది! మరో 80 మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు!

blast-victimనిజానికి ఈ ముప్పు ఎప్పటినుంచో ఊహిస్తున్నదే! హైదరాబాద్.. ఉగ్రవాదులకు సాఫ్ట్ టార్గెట్‌గా మారిందని నిరూపించిన ఘటనలు ఎన్నో! అందులోనూ దిల్‌సుఖ్‌నగర్‌లాంటి రద్దీ ప్రాంతాలు! గతంలో ఇక్కడ ఓ ఆలయం సమీపంలో బాంబు పేలినప్పుడే ముంద స్తు హెచ్చరికలు మోగాయి! గోకుల్-లుంబినీ జంట పేలుళ్ల సమయంలోనే ఇక్కడ పేలకుండా దొరికిన బాంబు.. నగరంలో అత్యంత తేలికైన లక్ష్యాల్లో దిల్‌సుఖ్‌నగర్ ఒకటని గోడమీద రాసింది! ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో.. ఎవరు ఎక్కడికి పోతున్నా రో తెలియని ఆ ప్రాంతంపై నిఘా ‘కళ్లు’ ఏం చేశాయన్నది ప్రశ్న! ఏం చేయలేకపోయిందో నిరూపించింది తాజా ఘటన! ఈ దారుణ మారణకాండను రికా ర్డు చేసేందుకు ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడంలో వైఫల్యం ఎవరిదన్నది తేలాల్సిన సమాధానం!

మృతుల్లో…bobblst1
ఇంతియాజ్ అహ్మద్,
ఎస్జీఎం పాలిటెక్నిక్ విద్యార్థి, వారాసిగూడ
ఎండీ రఫీక్, పఠాన్‌చెరువు, హైదరాబాద్
ఇజాజ్ రఫీ, కవాడిగూడ, హైదరాబాద్
ఆండాళ్లు, సంజయ్ గాంధీనగర్, హైదరాబాద్
ఒడ్డె విజయ్‌కుమార్, ఎంబీఎ విద్యార్థి, మంచిర్యాల
ముత్యాల రాజశేఖర్, ఎంబీఎ విద్యార్థి, మంచిర్యాల
వాలె రాములు, జీహెచ్‌ఎంసీ ఉద్యోగి, హైదరాబాద్
రవి, బోరబండ, హైదరాబాద్
యాదయ్య, చంపాపేట, హైదరాబాద్
అజీజ్ అహ్మద్, కొత్తగూడెం, రంగారెడ్డి జిల్లా
రఫీ అహ్మద్, కొత్తగూడెం, రంగారెడ్డి జిల్లా
ఎం రాజు, మంచిర్యాల
హరీశ్‌కార్తీక్, దిల్‌సుఖ్‌నగర్

గాయపడిన వారిలో..
మౌనిక (19) హైదరాబాద్, స్వాతి (22) బీఎన్ రెడ్డి నగర్- హైదరాబాద్, జమీద్ (19) జహీరాబాద్- మెదక్ జిల్లా, మానస (20) కరీంనగర్ జిల్లా, విఘ్నేష్ (25) ఎల్బీనగర్- హైదరాబాద్, శ్రీను (27) చైతన్యపురి-హైదరాబాద్, కృష్ణ (46) సరూర్‌నగర్- హైదరాబాద్, సుధ (22) హైదరాబాద్, ఎండీ ఆజి (19) కర్ణాటక, సన్నీ (20) కర్ణాటక, గోపాల్ రెడ్డి (20) బీఎన్ రెడ్డి నగర్- హైదరాబాద్, నర్సింహాడ్డి (19) హైదరాబాద్, రామ్మూర్తి (20) ఎల్‌బీనగర్- హైదరాబాద్, మల్లిఖార్జున్ ఎల్‌బీనగర్- హైదరాబాద్, అబ్దుల్ వాజిద్ కాలాపత్తర్- హైదరాబాద్, అమృతరవి కరీంనగర్, భాస్కర్, సుమన్, గిరి, వీరమ్మ ఆదిలాబాద్, సాయినాథ్, యాదయ్య, రమేష్, సయ్యద్, పరశురామ్, మోహన్‌రెడ్డి, సయ్యద్ మహ్మద్ (27), శివకుమార్ (18), మోహన్‌డ్డి, కృష్ణకాంత్ (40), రజిత, రాజశేఖర్, పత్యానాయక్, లక్ష్మీ నాయక్, వెంకటనారాయణ, మీర్జా ఆదిల్, వసీద్, రాజు, శ్రీరామ్, వెంకటలక్ష్మి, పాండురంగాడ్డి, సాయినాథ్, సత్య, రమేశ్‌నాయక్.

Osmania అది.. హైదరాబాద్‌లోనే అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన దిల్‌సుఖ్‌నగర్ మెయిన్ రోడ్డు. ప్రధాన బస్టాండ్ ప్రాంతం. సాయంత్రం 6.50 గంటలు. అంతకు 15 నిమిషాల ముందు కోణార్క్, వెంకటాద్రి థియేటర్‌లలో మ్యాట్నీ షో చూసిన ప్రేక్షకులు బయటకువచ్చారు. అప్పటికే వెంకవూటాది థియేటర్ వద్ద ఉన్న బస్టాపులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.

కిటకిటలాడుతున్నాయి. అందరిలోనూ ఒకటే ఆతృత! తమ ప్రాంతానికి వెళ్లే బస్సెప్పుడు వస్తుందా అని! మరోవైపు షాపింగ్ రద్దీ! ఎవరి పనిలో వారు! ఇంతలోనే పెద్ద శబ్దంతో పేలుడు! ఏం జరిగిందో తెలుసుకునే లోపలే మరో పేలుడు! అంతే ఆ ప్రాంతం ఒక్కసారిగా వణికిపోయింది. వెంకవూటాది థియేటర్ సమీపంలో సికింవూదాబాద్‌కు వెళ్లే బస్సులు ఆగే బస్టాప్‌లో సాయంత్రం 7.01 గంటలకు తొలి పేలుడు. అంతే.. పేలుడు ధాటికి ప్రాణాలు కోల్పోయి జీవచ్ఛవాలుగా కొందరు.. తీవ్రగాయాలతో ఆర్తనాదాలు చేస్తూ రక్తపు మడుగులో మరికొందరు.. ఒక్కసారిగా భీతావహ పరిస్థితి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే.. ఐదు నిమిషాల వ్యవధిలో 7.06 గంటలకు.. కోణార్క్ థియేటర్‌కు వెళ్లే దారిలోని నందగిరి కాంప్లెక్స్‌లోని ఏ1 మిర్చి సెంటర్ వద్ద మరో పేలుడు!! అంతే.. ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది.

ప్రజలు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ.. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు తీయడంతో మరింత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రజలు కకావికలమై పరుగులు పెట్టారు. ఒక దశలో తొక్కిసలాట చోటు చేసుకుంది. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. మొత్తం 25 మంది చనిపోయినట్లుగా భావిస్తున్నారు. అయితే.. సీఎం కిరణ్‌కుమార్‌డ్డి మాత్రం 11 మంది మృత్యువాతపడ్డారని ప్రకటించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం మృతుల సంఖ్య 17 వరకు ఉంటుందని భావిస్తున్నారు. 80 మందికి పైగా గాయాలయ్యాయి. కాగా, వెంకటాద్రి థియేటర్ వద్ద పేలని బాంబును పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేసినట్లుగా తెలిసింది.

ఆస్పవూతులకు క్షతగావూతులు…
విస్ఫోటనాలు జరిగిన కొన్ని నిమిషాలకే సరూర్‌నగర్…మలక్‌పేట పోలీసులు మొదట చేరుకున్నారు. పేలుళ్లలో గాయపడ్డవారిని సమీపంలోని ప్రయివేట్ ఆస్పవూతులతోపాటు ఉస్మానియా ఆస్పవూతికి తరలించారు. పేలుళ్లు జరిగిన చోట్ల ఆధారాలు చెదిరిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీరికి స్థానికంగా హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు సహకరించారు. ఆ తరువాత కొద్దిసేపటికి డీజీపీ దినేష్‌డ్డితోపాటు సైబరాబాద్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ, మరికొందరు పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు.

ఎన్‌ఎస్‌జీ.. ఎన్‌ఐఏ బృందాలు
పేలుళ్ల ఘటన విషయం తెలియగానే పోలీసు బలగాలు హుటాహుటిన ఆ ప్రాంతానికి తరలివచ్చాయి. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్…జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. క్లూస్‌టీం సిబ్బంది బాంబు శకలాలతోపాటు పలు కీలక ఆధారాలను క్లూస్ టీం సిబ్బంది సేకరించింది. ఢిల్లీ నుంచి ఎన్‌ఎస్‌జీ ప్రత్యేక బృందాలు, చెన్నైలోని ‘బ్లాక్ క్యాట్’ కమెండోలు కూడా హైదరాబాద్‌కు పయనమైనట్లుగా సమాచారం.

ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఎం
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి, హోంమంత్రి సబితా ఇంద్రాడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి, కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్, బీజేపీ నాయకులు బండారు దత్తావూతేయ, కిషన్‌డ్డి, హైదరాబాద్ మేయర్ మాజిద్ హుస్సేన్‌తోపాటు వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, రాత్రి 12 గంటల ప్రాంతంలో నాంపల్లి కేర్ ఆస్పవూతిలో చికిత్స పొందుతున్న పేలుళ్ల క్షతగావూతులను సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, హోంమంత్రి సబితాఇంవూదాడ్డి పరామర్శించారు.

సీపీ వచ్చి వెళ్లిన కొన్ని నిమిషాలకే
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన కొన్ని నిమిషాలకే జంట పేలుళ్లు సంభవించడం గమనార్హం. గురువారంకావటంతో పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ ఇక్కడి సాయిబాబా ఆలయానికి సాయంత్రం 6.15 గంటల సమయంలో వచ్చారు. దర్శనం చేసుకుని దాదాపు 6.35 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. కమిషనర్ రాకను పురస్కరించుకుని అప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు వెంకవూటాది థియేటర్ బస్టాప్, కోణార్క్ థియేటర్ వద్ద తోపుడు బండ్లు, ఇతరత్రా చిరు వ్యాపారులను అక్కడి నుంచి పంపించేశారు. సీపీ వెళ్లిపోయాక వ్యాపారాలు చేసుకునేవారు తిరిగి వస్తుండగా.. పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఇదే జరగకుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగేదని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే.. కమిషనరే టార్గెట్‌గా పేలుళ్లు జరిపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతా క్షణాల్లోనే
‘పేలుళ్లు జరిగినప్పుడు నేను కోణార్క్ థియేటర్ వద్దే ఉన్నాను. అప్పుడే చాలా మంది థియేటర్ నుంచి జనం బయటకు వచ్చారు. మరోవైపు ఫస్ట్ షో చూడటానికి జనం పెద్ద సంఖ్యలో రావటంతో చౌరస్తా మొత్తం రద్దీగా ఉంది. అంతలోనే మొదటి బాంబు పేలింది. పేలుడు దాటికి నాకు కొన్ని సెకన్లపాటు ఏమీ వినిపించలేదు. తేరుకుని వెళ్లి చూడగా రక్తమోడుతూ కుప్పకూలిన శరీరాలు కనిపించాయి.’ విజయ్, ప్రత్యక్ష సాక్షి

నేడు రాష్ట్ర బంద్ : బీజేపీ
దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు పేలుళ్లను నిరసిస్తూ రాష్ట్ర బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. బంద్ ఏ మతానికి, ఎవరికి వ్యతిరేకం కాదని, ఉగ్రవాదానికి మాత్రమే వ్యతిరేకమని, బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. హింసను సహించబోమనే హెచ్చరికను పాకిస్థాన్‌కు అందజేసేందుకు బంద్‌కు పిలుపునిచ్చామన్నారు.

నేడు మంత్రివర్గం అత్యవసర భేటీ
పేలుళ్ల నేపథ్యంలో సీఎం కిరణ్‌కుమార్‌డ్డి శుక్రవారం తన క్యాంప్ ఆఫీసులో మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. పేలుళ్లలతో పాటు జేఏసీ తలపెట్టిన సడక్‌బంద్ తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశముంది.

ఆ బాంబులు.. ఐఈడీ ?
రెండుచోట్ల పేలింది ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజీవ్ డివైస్‌లని భావిస్తున్నారు. బాంబుల్లో ఇనుప గోళీలు, మేకులు ఉపయోగించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ కారణం వల్లనే మృతులు, గాయపడ్డవారి సంఖ్య ఎక్కువగా ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఉగ్రవాదులు నగరంలో ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజీవ్ డివైస్‌లను పేల్చిన విషయాన్ని గుర్తు చేశారు. బిళ్లలు బిళ్లలుగా ఉండి ప్రత్యేకంగా తయారు చేయించే ఇనుప పైపుల్లో అమ్మోనియం నైట్రేట్‌తోపాటు గంధకం ఇతర పేలుడు పదార్థాలను కూరి.. దాంట్లో ఇనుప గోళీలు, బాల్ బేరింగులు, మేకులు పెట్టి ప్యాక్ చేస్తారని వివరించారు. అనంతరం వాటికి టైమర్లు అమరుస్తారన్నారు. బాంబు పేలటానికి డిటోనేటర్లను ఉపయోగిస్తారని వివరించారు. బాంబు పేలగానే పేలుడు పదార్థాలు ఉంచిన ఇనుప పైప్‌తోపాటు దాంట్లో పెట్టిన ఇనుప గోళీలు, బాల్ బేరింగులు, ఇనుప మేకులు నలువైపులా విపరీతమైన వేగంతో దూసుకుపోతాయన్నారు. ఇలా దూసుకెళ్లే ఇనుప గోళీలు, బాల్ బేరింగులు, ఇనుప మేకులు తుపాకీ బుల్లెట్లలా ప్రాణాలు తీయటంతోపాటు తీవ్రంగా గాయపరుస్తాయని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.