తీగల ఉన్నాడు జాగ్రత్త..!!

తెలంగాణ ఉద్యమకారులకు హెచ్చరిక.. తీగల కృష్ణారెడ్డి ఉన్నాడు జాగ్రత్త.. ఉద్యమకారుడినని ఎక్కడైనా అనేరు.. తీగల అనుచరులు మీ ఒళ్లు హోనం చేస్తరు.. మీ నోటికి తీగలు చుడుతరు..

ఎవడైనా ఉద్యమకారులమని అంటే ఉరికిచ్చి కొట్టమని.. టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న తీగల కృష్ణారెడ్డి.. తన అనుచరులను ఆదేశించాడు. ఇక అతని అనుచరులు రెచ్చిపోయారు. టీఆర్ఎస్‌లో.. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నవారి వీపు విమానం మోత మోగించారు.

ఉద్యమకారులారా జర భద్రం.. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఉద్యమ నేపథ్యంలోంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఇంకా భద్రంగా ఉండాలి.. పొరపాటున ఉద్యమకారులమని చెప్పుకున్నారో.. తీగల మీసం మెలేస్తరు.. తర్వాత మీ ఇష్టం..  ఎందుకైనా మంచిది.. ఉద్యమ కాలంలో పనిచేసిన జర్నలిస్టులు కూడా మీడియా పాయింట్‌ దగ్గర కొంచెం అటు ఇటు చూసి మాట్లాడుకోండి.. మీరు కూడా ఉద్యమంలో ఉన్నారని ఆయన పసిగట్టకుండా జాగ్రత్త పడండి..

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *