తిరుగులేని రాజకీయశక్తిగా టీఆర్‌ఎస్‌ :కడియం

టీఆర్‌ఎస్ పార్టీని ఉద్యమపరంగానే కాకుండా బలమైన రాజకీయ శక్తిగా తీర్చుదిద్దుతామని ఆపార్టీ నేత కడియం శ్రీహరి అన్నారు. టీఆర్‌ఎస్‌ను రాజకీయశక్తిగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. ఈనెల 26 నుంచి 30 వరకు అన్ని మండల కేంద్రాల్లో పార్టీ విస్తృతస్ధాయి సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు నియోజక వర్గాల్లో అన్ని స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈమేరకు చర్చించేందుకు జులై 3న మరోసారి భేటీ అవుతామని చెప్పారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.