తిరగబడ్డ ఓరుగల్లు

జగన్ సేనపై తెలంగాణ జనం తిరుగుబాటు చేశారు. ఊరూ రా మానుకోటలై రాళ్లెత్తారు. తెలంగాణ స్వప్నం సాకారం అ య్యే కల దగ్గరపడుతున్న వేళ జగన్ సమైక్య శంఖారావం పూ రించడంపై అగ్గి పిడుగులయ్యారు. జిల్లా నుంచి జగన్ సభకు జనం ఎవరూ పోకపోయినా సీమాంధ్ర నుంచి జిల్లా మీదుగా తరలిపోయే వాహనాలను జడివానను సైతం లెక్కచేయక తిరు గుబాటు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని ఓరుగల్లు పల్లెలు తన పోరు ప్రతా పాన్ని రుచి చూపాయి.

దొంగచాటుగా గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ పోవాలనుకునే వాహనాలను అడ్డుకున్నారు. హై దరాబాద్‌లో నిర్వహించే సభను జరుగనివ్వమంటూ సీమాంధ్ర నుంచి వచ్చే సమైక్యవాదులను ఓరుగల్లు పోరుబిడ్డలు అడ్డుకు న్నారు. పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యవాద ప్లకార్డును ప్రదర్శించిన జగన్‌ను ఓదార్పు యాత్రకు జిల్లాకు రాకుండా మానుకోట పౌరుషాన్ని రుచిచూపించినట్లుగా సమై క్య శంఖారావం సభకు వెళ్తున్న సమైక్యవాదులను జిల్లాలో అడ్డు కున్నారు.

విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లేదారిలో నల్ల గొండ వద్ద రోడ్డు తెగిపోవడంతో వరంగల్ మీదుగా హైదరాబా ద్ వెళ్లారు. శుక్రవారం రాత్రి నుంచే వర్ధన్నపేట, రాయపర్తి మీ దుగా హైదరాబాద్ వెళ్లే సమైక్యవాదుల వాహనాలను తెలంగా ణ ప్రజలు అడ్డుకొని వెనక్కి పంపించారు. ముందస్తుగానే పో లీసుల సహాయంతో వాహనాల్లో వచ్చినప్పటికీ భట్టుపల్లి, కడి పికొండ రహదారులు రణదారులను తలపించాయి. సీమాంధ్ర నుంచి తరలివెళుతున్న బస్సులపై దాడి చేశారు. తెలంగాణ పో రుప్రతాపాన్ని రుచిచూపారు.

వర్ధన్నపేట, రాయపర్తి రహదారు ల్లోనూ తెగువ చూపారు. కడిపికొండ కడుపు మండిపోయింది. జైతెలంగాణ నినాదాలతో సామాన్య జనం అనితర సాధ్యమైన పోరు పతాకలయ్యారు. సీమాంధ్రవాదులకు పోలీసులు ఎస్కా ర్టుగా మారాల్సిన దుస్థితి ఎదురైంది. మరోవైపు సూర్యాపేట- జనగామ రహదారిలోని దేవరుప్పుల, సింగరాజుపల్లి బస్‌స్టేజీల వద్ద టీడీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి సమైక్యవాదుల వాహ నాలను అడ్డుకున్నారు. కొద్దిసేపు టీడీపీ టీఫోరం కన్వీనర్ ఎర్ర బెల్లి దయాకర్‌రావు సైతం టీడీపీ కార్యకర్తలతో కలిసి అడ్డుకునే ప్రయత్నం చేసి వెళ్లిపోయారు.

This entry was posted in Top Stories.

Comments are closed.