‘తాతగారి ఆశయ సాధన కోసమే టీఆర్‌ఎస్‌లోకి’

రంగారెడ్డి : తాతగారి ఆశయ సాధన కోసమే టీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నానని కేవీ విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. చేవేళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విశ్వేశ్వర్‌రెడ్డి ప్రసంగించారు. తాత స్ఫూర్తితో చిన్నప్పుడే తాను గోడల మీద జై తెలంగాణ అని రాశాను అని గుర్తు చేశారు. విలీనం నాటి నుంచి తెలంగాణకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్ని ఉద్యోగాలు చేసినప్పటికీ తాత ఆశయాలు తనను వెంటాడుతున్నాయని, తాత ఏకైక లక్ష్యమైన తెలంగాణ సాధనే తన లక్ష్యమని తేల్చిచెప్పారు. తాత గారి ఆశయాలను నెరవేర్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సాధిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రోళ్ల పాలనలో రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. నీళ్లు, నిధులు అన్నీ దోచుకున్నారని మండిపడ్డారు. చదువుకోవడానికి విద్యార్థులకు డిగ్రీ కళాశాల కూడా లేదని చెప్పారు. పది జిల్లాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ రావడమే ముఖ్యమన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.