తాజా, మాజీ మంత్రులకు ప్రత్యేక సెగ

muslim
ఎర్రగట్టుగుట్ట వద్ద సారయ్యను అడ్డుకున్న తెలంగాణవాదులు
– నర్సింహులపేటలో రెడ్యానాయక్‌కు నిలదీసిన టీఆర్‌ఎస్ నేత
వరంగల్ జిల్లాలో తాజా, మాజీ మంత్రులకు తెలంగాణ సెగ తగిలింది. మంత్రి బస్వరాజు సారయ్య శనివారం వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో జాతర జరుగుతున్న ఎర్రగట్టుగుట్ట శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. మంత్రిని జాతర ప్రాంగణంలోనే జేఏసీ మండల కన్వీనర్ అనుమాండ్ల విద్యాసాగర్, పట్టణ కన్వీనర్ నాగమల్ల సురేశ్ ఆధ్వర్యంలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య మంత్రిని, ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ఆలయానికి చేర్చారు. జాతర ప్రాంగణం లో తెలంగాణనినాదాలతో భక్తులు హోరెత్తించారు. మరోఘటనలో ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు నర్సింహుటపేట మండలంలో పర్యటిస్తున్న మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్‌కు తెలంగాణవాదులు నిరసన తెలిపారు.

నర్సింహులపేటలో రెడ్యానాయక్ మాట్లాడుతుండగా టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎండీ ఖాజామియా నేతృత్వంలో అడ్డుపడ్డారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. స్వార్థం కోసమే గ్రామాల్లో పర్యటిస్తున్నారు తప్ప రాష్ట్ర ఏర్పాటుపై ఎక్కడా మాట్లాడడంలేదని మండిపడ్డారు. తెలంగాణ కోసం డోర్నకల్ నియోజకవర్గంలో ఆరుగురు ఆత్మబలిదానం చేసుకున్నారని, చిత్తశుద్ధి ఉంటే వారికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రెడ్యానాయక్ జోక్యం చేసుకొని ఇప్పటికే తాను ఆర్థికంగా వెనుకబడి ఉన్నానని, ఏం సహాయం చేయలేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం గతంలో ఉద్యమాలు చేపట్టామని చెప్పారు. అనంతరం రెడ్యానాయక్ సైతం జై తెలంగాణ నినాదాలు చేయడంతో ఖాజామియా వెళ్లిపోయారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.