తల్లడిల్లుతున్న ఓయూ

– విద్యార్థుల ఆత్మహత్యలతో ఆక్రందన
– 2010 నుంచి తెలంగాణ కోసం బలిదానాలు
– తాజాగా మరొకరు..
 ఉద్యమాల పురిటిగడ్డ, విద్యా కుసుమాల క్షేత్రం.. ఉస్మానియా యూనివర్సిటీ! ఆ గడ్డ.. తల్లడిల్లుతోంది! ఆ క్షేత్రం.. విలపిస్తోంది! తన బిడ్డల ఆత్మహత్యలు చూసి ఓయూ తల్లి గుండె చెరువవుతోంది! ఇక్కడ తెలంగాణ కోసం విద్యార్థుల బలిదానాలు ఆగడం లేదు. తాజాగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఓయూ కేంద్రబిందువుగా మారింది. 1969 ఉద్యమం కంటే మలిదశ ఉద్యమంలో ఇక్కడి విద్యార్థులు ప్రత్యేక రాష్ట్ర కాంక్షను నేరవేర్చుకోవాలని అందరికంటే ముందంజలో ఉన్నారు.

భవిష్యత్తు అంటే విద్య కాదు, రాష్ట్ర సాధనే అంటూ క్యాంపస్ గోడలు దాడి బయటకు వస్తున్నారు. అన్నివర్గాల ప్రజలను ఉద్యమం వైపు మళ్లించారు. అయితే, తెలంగాణపై కొందరు నాయకులు చేస్తున్న ఇష్టారీతి వ్యాఖ్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి విద్యార్థులను మనస్తాపానికి గురిచేస్తోంది. ఆ మనస్తాపం ఆత్మహత్యలకు దారితీస్తోంది. మలిదశ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఓయూలో బలిదానాలు ప్రారంభమయ్యాయి.
మలి దశ ఉద్యమం ప్రారంభమైన అనంతరం 2010లో నల్లగొండ జిల్లాకు చెందిన వేణుగోపాల్‌డ్డి అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియం వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుతోనైనా.. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకుంటున్న ప్రజావూపతినిధుల్లో మార్పురావాలని లేఖ రాసి తనువు చాలించాడు.
అదే ఏడాది అసెంబ్లీ ముట్టడి పిలుపు సందర్భంగా ఓయూ ఎన్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో రంగాడ్డి జిల్లాకు చెందిన యాదయ్య అనే ఇంటర్ విద్యార్థి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని కన్నుమూశాడు. అప్పట్లోనే ఓయూ టెక్నాలజీ కళాశాల విద్యార్థి సాయికుమార్ తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు.
2011లో మెదక్ జిల్లాకు చెందిన ఇషాన్‌డ్డి అనే ఇంజినీరింగ్ పూర్తయిన యువకుడు తెలంగాణ రాష్ట్ర కాంక్షను వ్యక్తం చేస్తూ ఓయూ లైబ్రెరీ సమీపంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ప్రాణాలు విడిచాడు. ఇషాన్ చివరి కోరిక మేరకు ఓయూ నుంచి గన్‌పార్క్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
2012లో సంతోష్ అనే నాన్‌బోర్డర్ ఆర్ట్స్ కళాశాల సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్నాడు.
సోమవారం తెల్లవారుజామున భరత్‌గౌడ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని కోరుకుంటూ, రాజకీయ నాయకులు ఇప్పటికైనా తమ స్వార్థ ప్రయోజనాలను వదిలివేయాలని కోరుతూ లేఖలు రాసి పెట్టి చనిపోయారు.
తెలంగాణ ఉద్యమ నేపథ్యమే గాక ఇతరత్ర కారణాలతో కూడా కొంతమంది ఓయూలో బలన్మరణం చెందారు. ఈ నెలలోనే రమేష్ అనే నాన్‌బోర్డర్ ఆర్ట్స్ కళాశాల సమీపంలోని ఆలయం ఎదురుగా చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. జువాలజీ పరిశోధక విద్యార్థి శ్రీనివాస్ కూల్‌వూడింక్‌లో రసాయనం కలుపుకుని ల్యాబ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.